కాంగ్రెస్‌లో చేరిన ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి

ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గురువారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

కాంగ్రెస్‌లో చేరిన ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి
  • సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక

విధాత: ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గురువారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్కలు ఉన్నారు. అంతకుముందు రోజునే అదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ కూడా సీఎం రేవంత్‌రెడ్డితో భేటీయై కాంగ్రెస్‌లో చేరారు.


పార్లమెంటు ఎన్నికలకు ముందు బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కోక్కరుగా కాంగ్రెస్‌, బీజేపీలలో చేరుతుండటం గులాబీ పార్టీ వర్గాలను కలవరపాటుకు గురి చేస్తుంది. వరుస వలసలతో ఆ పార్టీ నాయకత్వం సతమతమవుతుంది. తమ నాయకులు పార్టీ మారుతున్న తీరు చూసి కేడర్ ఆందోళనకు గురవుతుంది.