అత్యంత విష‌మంగా ములాయం ఆరోగ్య ప‌రిస్థితి

విధాత: స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాద‌వ్‌(82) ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. ఈ మేర‌కు ములాయం ఆరోగ్య ప‌రిస్థితిపై మేదాంత ఆస్ప‌త్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు. ములాయం సింగ్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిపారు. ఆయా డాక్ట‌ర్లు ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నార‌ని పేర్కొన్నారు. ఈ హెల్త్ బులెటిన్‌ను స‌మాజ్‌వాదీ పార్టీ ట్వీట్ చేసింది. ములాయం త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న అభిమానులు, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్తలు ప్రార్థిస్తున్నారు. గ‌త […]

  • By: krs    latest    Oct 04, 2022 10:40 AM IST
అత్యంత విష‌మంగా ములాయం ఆరోగ్య ప‌రిస్థితి

విధాత: స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాద‌వ్‌(82) ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. ఈ మేర‌కు ములాయం ఆరోగ్య ప‌రిస్థితిపై మేదాంత ఆస్ప‌త్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు. ములాయం సింగ్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిపారు. ఆయా డాక్ట‌ర్లు ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నార‌ని పేర్కొన్నారు.

ఈ హెల్త్ బులెటిన్‌ను స‌మాజ్‌వాదీ పార్టీ ట్వీట్ చేసింది. ములాయం త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న అభిమానులు, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్తలు ప్రార్థిస్తున్నారు. గ‌త కొంత‌కాలం నుంచి అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ములాయం సింగ్ యాద‌వ్.. ఈ నెల 2వ తేదీన ఆస్ప‌త్రిలో చేరిన విష‌యం విదిత‌మే.