మునుగోడు ఉప ఎన్నిక: లెక్కలు వచ్చినయ్.. ఎవరెంత ఖర్చు పెట్టారంటే!

విధాత, దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా విమర్శలు ఎదుర్కొన్న మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం వెల్లడించిన అభ్యర్థుల వ్యయం లెక్కలు మాత్రం విస్మయం కొలిపేలా ఉన్నాయి. ఈ ఉప ఎన్నికల్లో దాదాపు 500 కోట్ల మేరకు ప్రధాన పార్టీలు ఖర్చు చేశాయని రాజకీయ, మేధావి వర్గాల నుండి తీవ్రమైన విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో అభ్యర్థుల అధికారిక ఖర్చు లెక్కలు మాత్రం అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. ఉప ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి ఎన్నికల సంఘం […]

  • By: krs    latest    Dec 16, 2022 12:19 PM IST
మునుగోడు ఉప ఎన్నిక: లెక్కలు వచ్చినయ్.. ఎవరెంత ఖర్చు పెట్టారంటే!

విధాత, దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా విమర్శలు ఎదుర్కొన్న మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం వెల్లడించిన అభ్యర్థుల వ్యయం లెక్కలు మాత్రం విస్మయం కొలిపేలా ఉన్నాయి. ఈ ఉప ఎన్నికల్లో దాదాపు 500 కోట్ల మేరకు ప్రధాన పార్టీలు ఖర్చు చేశాయని రాజకీయ, మేధావి వర్గాల నుండి తీవ్రమైన విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో అభ్యర్థుల అధికారిక ఖర్చు లెక్కలు మాత్రం అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి.

ఉప ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి ఎన్నికల సంఘం 40 లక్షల వరకు ఖర్చు చేసుకునే అవకాశం కల్పించింది. ఓటర్లను ఆకర్షించే క్రమంలో అభ్యర్థులు మాత్రం వందల కోట్లలో డబ్బును ఖర్చు చేశారు. అయితే ఎన్నికల సంఘం తేల్చిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల వివరాలు పరిశీలిస్తే అత్యధికంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 34 లక్షల 75000 ఖర్చు చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 28 లక్షల 96000 ఖర్చు చేయగా, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 26 లక్షల 12000 ఖర్చు చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి ఆందోజు శంకరాచారి 13లక్షల11,500, తెలంగాణ జన సమితి అభ్యర్థి పల్లె వినయ్ కుమార్ గౌడ్ 5, 58,483 రూపాయలు, యుగ తులసి పార్టీ అభ్యర్థి క. శివకుమార్ , 321,200, ప్రజావాణి పార్టీ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లు 1,35,768 రూపాయలు ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘం లెక్కలు తెలుపుతున్నాయి.

47 మంది పోటీ పడిన మునుగోడు ఉప ఎన్నికల్లో 13 మంది అభ్యర్థులు ఒక లక్ష కంటే అధికంగా ఖర్చు చేయగా , మిగిలిన 24 మందిలో 11 మంది 5000 నుంచి 10000 లోపు ఖర్చు చేసినట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఇండిపెండెంట్లలో అధికంగా అభ్యర్థి కే.ఏ.పాల్ 6 లక్షల 79వేలు ఖర్చు చేసినట్లుగా ఎన్నికల సంఘం వెల్లడించింది.