మునుగోడు ప్రజా ఆశీర్వాదంతో మళ్లీ గెలుస్తా: రాజగోపాల్ రెడ్డి
విధాత, నల్లగొండ: మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో ఉప ఎన్నికల్లో తాను మళ్లీ విజయం సాధిస్తానని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఇప్పర్తి, రావిగూడెం, తెరేటిపల్లి, జక్కల వారి గూడెంల నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి పలువురు రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. 2023 సాధారణ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం […]

విధాత, నల్లగొండ: మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో ఉప ఎన్నికల్లో తాను మళ్లీ విజయం సాధిస్తానని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఇప్పర్తి, రావిగూడెం, తెరేటిపల్లి, జక్కల వారి గూడెంల నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి పలువురు రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. 2023 సాధారణ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. సీఎం కేసీఆర్ అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయడం బీజేపీకే సాధ్యమవుతుందన్నారు. తాను స్వార్థం కోసం రాజీనామా చేయలేదని, మునుగోడు అభివృద్ధి కోసం ఉప ఎన్నికల సిద్ధపడ్డానని అన్నారు.
రాజీనామాతో మునుగోడు అభివృద్ధి పరుగులు పెడుతుందని, నా రాజీనామా వృధా కాలేదన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ అంటే తనకు అభిమానమని, అధిష్టానం తప్పుడు నిర్ణయంతోనే తెలంగాణలో కాంగ్రెస్ బలహీన పడిందని, నాలుగు పార్టీలు మారిన వ్యక్తికి, ఓటుకు నోటు కేసులో ముద్దాయికి టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించడంతో పార్టీలో అంతర్గత కలహాలు మొదలై కాంగ్రెస్ పతనమవుతుందన్నారు.
మునుగోడు ప్రజలు ఉప ఎన్నికల్లో చరిత్రత్మక తీర్పుతో బీజేపీని గెలిపించబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పాలకూరి యాదయ్య వేదాంత గోపీనాథ్ పులకరం సైదులు ప్రమోద్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొన్నారు.