నా భర్త వేధింపులు అన్నీ ఇన్నీ కావు: కళ్యాణి

విధాత: సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ కరాటే కళ్యాణి. ఆమె ఒక ఫైర్ బ్రాండ్. మా ఎలక్షన్స్‌లో కూడా ఆమె చేసిన హంగామా అంతా కాదు. అయితే ఆమె వైవాహిక జీవితంలో పలు కష్టాలు పడిందట. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. నా జీవితం వివాహం వల్ల నాశనం అయిందని పరోక్షంగా వెల్లడించింది. కళ్యాణి భర్త హింసించాడట. అతడి వేధింపులు ఎలా ఉండేవో ఒక ఉదాహరణ చెప్పింది. ఓ రోజు బేగంపేటలో నడిరోడ్డుపై బట్టలు లాగేసి […]

  • By: krs    latest    Dec 25, 2022 7:30 AM IST
నా భర్త వేధింపులు అన్నీ ఇన్నీ కావు: కళ్యాణి

విధాత: సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ కరాటే కళ్యాణి. ఆమె ఒక ఫైర్ బ్రాండ్. మా ఎలక్షన్స్‌లో కూడా ఆమె చేసిన హంగామా అంతా కాదు. అయితే ఆమె వైవాహిక జీవితంలో పలు కష్టాలు పడిందట. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. నా జీవితం వివాహం వల్ల నాశనం అయిందని పరోక్షంగా వెల్లడించింది. కళ్యాణి భర్త హింసించాడట. అతడి వేధింపులు ఎలా ఉండేవో ఒక ఉదాహరణ చెప్పింది. ఓ రోజు బేగంపేటలో నడిరోడ్డుపై బట్టలు లాగేసి వివస్త్రను చేశాడట. అందరూ చూస్తుండగానే త‌న‌కు ఇలా అవ‌మానం జరిగిందని ఆమె వాపోయింది.

నా భ‌ర్త దారుణాల‌లో ఇవి కొన్నేనంటోంది. అతడు దారుణమైన వేధింపులకు పాల్ప‌డ్డాడు. అతనితో జీవించలేక విడాకులు తీసుకుని విడిపోయాను. నేను చేసే పాత్రల ద్వారా నన్ను చాలామంది తప్పుగా అనుకుంటారు. కానీ నేను నిజ జీవితంలో చాలా మందికి సహాయం చేశాను. సినిమాలు కేవలం బతుకు దెరువు కోసం చేస్తున్నాను. నాది సినిమాల్లో కనిపించే లాంటి మనస్తత్వం కాదు అని ఆమె చెప్పుకొచ్చింది. 40 ప్లస్‌లో ఉన్న కరాటే క‌ళ్యాణి రెండో వివాహానికి కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉంది. నిజమైన ప్రేమ కోసం పరితపిస్తున్నాను. స్వచ్ఛమైన ప్రేమ అందించే వ్యక్తి దొరికితే వివాహం చేసుకుంటాను అని చెప్పింది.

కళ్యాణి చాలా కాలంగా ఒంటరిగా ఉంటుంది. ఆమె ఒక పాపను పెంచుకుంటుంది. అయితే సరైన దత్త పత్రాలు లేకుండా ఆమె పాపను పెంచుకుంటున్నారని ఆరోపణలు రావడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆమెపై దాడులు చేశారు. పాప కోసం కరాటే కళ్యాణి ఇంటిని అధికారులు సోదా చేశారు. తరువాత ఆమె తన వద్ద పెరుగుతున్న పాప తల్లిదండ్రులతో పాటు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు.

విజయనగరానికి చెందిన కరాటే కళ్యాణి బ్లాక్ బెల్ట్ సాధించింది. అనేక చిత్రాల్లో వ్యాంపురోల్స్ ద్వారా పాపులర్ అయింది. ముఖ్యంగా రవితేజ నటించిన ‘కృష్ణ, మిరపకాయ్’ చిత్రాల్లో ఆమె చేసిన పాత్రలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. అబ్బ..చంపేశారు అంటూ మిరపకాయ్‌, ఇంటి ఓనర్ బ్రహ్మానందంతో రొమాన్స్ చేసే పనిమనిషి పాత్రలో కృష్ణ చిత్రాల‌లో నటించింది. ఈమె పలు సీరియల్స్‌లో కూడా న‌టించింది. కానీ ఈ మధ్య సినిమాలు, సీరియ‌ర్ల‌లో కనిపించడం లేదు. కాగా ఆమె బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే.