Naga Chaithanya: బాహుబలి నిర్మాతతో.. నాగ చైతన్య భారీ చిత్రం

అక్కినేని నాగ చైతన్య మళ్లీ వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. ఒకదాని తర్వాత మరోటి సినిమాలు లైన్‌లో పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో సాయి పల్లవి హీరోయిన్‌గా సర్వెవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘తండేల్’ ఫిబ్రవరి 7న మూవీ విడుదల కానుంది.
దీంతో నాగ చైతన్య తదుపరి సినిమాపై ఓ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విరూపాక్ష డైరెక్టర్‌తో ఓ సినిమా పట్టాలెక్కించిన చైతన్య. ఇప్పుడు బాహుబలి నిర్మాతలు అర్కా మిడియా నిర్మాణంలో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మీడియా వర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.
కాగా ఈ మూవీ హర్రర్, కామెడీ నేపథ్యంలో ఉండనున్నట్లు సమాచారం. ఈ మూవీని కొత్త దర్శకుడితో చేయబోతున్నారు. అయితే, ఈ ప్రాజెక్టును అతి త్వరలోనే అనౌన్స్ చేస్తారని అంటున్నారు. బాహుబలి నిర్మాతల బ్యానర్ అనగానే భారీ బడ్జెట్ కళ్ల ముందు మెదులుతుంది. మరి నాగచైతన్యతో కూడా భారీ బడ్జెట్లోనే రూపొందబోతున్నట్టు సమాచారం.