కాంగ్రెస్ గెలిస్తే ఉచిత వైద్యం.. నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్ రెడ్డి

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.10 లక్షల తో పేదలకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు అందిస్తామని నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జై వీర్ రెడ్డి అన్నారు. మంగళవారం త్రిపురారం మండలం కాపువారి గూడెంలో ఎన్నికల ప్రచారం చేశారు. పార్టీ నాయకులతో కలిసి జైవీర్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ వారికే అన్ని పథకాలు ఇచ్చి, నిజమైన అర్హులకు కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.