హీరో నాగశౌర్య పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే?

విధాత: యంగ్ హీరో నాగశౌర్య పెళ్లికొడుకు కాబోతున్నాడు. సైలెంట్‌గా తన పెళ్లి వార్తను నాగశౌర్య గురువారం రివీల్ చేశాడు. బెంగళూర్‌కి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అయిన అనూష శెట్టిని నాగశౌర్య వివాహం చేసుకోబోతున్నాడు. అయితే ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కాదు. నాగశౌర్య, అనూష శెట్టి గత కొంతకాలం ప్రేమలో ఉన్నారని, ఈ ప్రేమ విషయం శౌర్య తల్లిదండ్రులకు కూడా తెలియదనేది తాజా సమాచారం. అయినా తన కుమారుడు ప్రేమ విషయం చెప్పగానే.. అంతకంటే ఇంకేం కావాలి […]

  • By: krs    latest    Nov 10, 2022 3:57 PM IST
హీరో నాగశౌర్య పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే?

విధాత: యంగ్ హీరో నాగశౌర్య పెళ్లికొడుకు కాబోతున్నాడు. సైలెంట్‌గా తన పెళ్లి వార్తను నాగశౌర్య గురువారం రివీల్ చేశాడు. బెంగళూర్‌కి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అయిన అనూష శెట్టిని నాగశౌర్య వివాహం చేసుకోబోతున్నాడు. అయితే ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కాదు.

నాగశౌర్య, అనూష శెట్టి గత కొంతకాలం ప్రేమలో ఉన్నారని, ఈ ప్రేమ విషయం శౌర్య తల్లిదండ్రులకు కూడా తెలియదనేది తాజా సమాచారం. అయినా తన కుమారుడు ప్రేమ విషయం చెప్పగానే.. అంతకంటే ఇంకేం కావాలి అన్నట్లుగా తల్లిదండ్రులు లగ్నం ఫిక్స్ చేసినట్లుగా టాక్. పెళ్లికి సంబంధించి శుభలేఖ కూడా విడుదల చేశారు. నాగశౌర్య, అనూష శెట్టిల వివాహం ఈ నెల 20వ తేదీన 11:25 నిమిషాలకు జరగబోతోంది.

అయితే నాగశౌర్య, అనూషల ప్రేమ వ్యవహారమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అసలెప్పుడు వీరిద్దరూ ప్రేమించుకున్నారనేదే ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే చిన్న విషయం కూడా ఈ మధ్య మీడియాకి లీక్ అయిపోతుంది. అలాంటిది ఒక అమ్మాయిని హీరో ప్రేమిస్తున్నాడనే విషయమే తెలియకుండా నాగశౌర్య భలే షాకిచ్చాడని అంతా అనుకుంటుండటం విశేషం.

ఏదైతేనేం.. బ్యాచ్‌లర్ స్టేజ్ నుంచి ఓ ఇంటివాడు కాబోతోన్న నాగశౌర్యకు ఇప్పుడంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అన్నట్లు.. ఈ లేఖలో ఈ పెళ్లికి వచ్చే వారు ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తులలోనే రావాలని మెన్షన్ చేయడంపై కూడా ఆసక్తికరంగా చర్చలు నడుస్తుండటం గమనార్హం.