Mouni Roy | ఇండస్ట్రీ ఇలానే ఉంటుందని అప్పుడే అర్థమైంది..! ‘నాగిని’ బ్యూటీ మౌనీ రాయ్‌ కీలక వ్యాఖ్యలు..!

స్మాల్‌ స్క్రిన్‌ బ్యూటీ మౌనీ రాయ్‌ బిగ్‌ స్క్రీన్‌పై సైతం రాణిస్తున్నది. ‘నాగిని’ సీరియల్‌తో మంచి గుర్తింపును సాధించింది

Mouni Roy | ఇండస్ట్రీ ఇలానే ఉంటుందని అప్పుడే అర్థమైంది..! ‘నాగిని’ బ్యూటీ మౌనీ రాయ్‌ కీలక వ్యాఖ్యలు..!

Mouni Roy | స్మాల్‌ స్క్రిన్‌ బ్యూటీ మౌనీ రాయ్‌ బిగ్‌ స్క్రీన్‌పై సైతం రాణిస్తున్నది. ‘నాగిని’ సీరియల్‌తో మంచి గుర్తింపును సాధించింది. ఈ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరైంది. ఆ తర్వాత బాలీవుడ్‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అందం, అభినయంతో ఆకట్టుకున్నది. ‘గోల్డ్‌’ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. బ్రహ్మాస్త్రలో కీలక పాత్రను పోషించింది. అయితే, ఇటీవల మౌనీ రాయ్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. కెరీర్‌లో తొలినాళ్లలో ఎదురైన సంఘటనలతో పాటు వ్యక్తిగత విషయాలపై చెబుతూ భావోద్వేగానికి లోనైంది. తాను అందంగా, అట్రాక్టివ్‌గా ఉండనని తనను తాను విమర్శించుకునేదాన్నని.. అదే నిజమని నిర్ణయానికి వచ్చానని తెలిపింది. ఆధ్యాత్మిక ప్రయాణం ఆరంభించిన తర్వాత ఇలాంటి ఆలోచనల నుంచి బయటపడ్డానని చెప్పింది. తనను తాను ప్రేమించడం, అంగీకరించడంలో ధాన్యం ఎంతో సహాయపడిందని చెప్పుకొచ్చింది. ఈ విషయం తన స్నేహితులకు తెలుసునని.. అయితే, మీడియాకు చెప్పడం ఇదే తొలిసారని తెలిపింది. తన 17 సంవత్సరాల కెరీర్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని.. గొప్పస్థాయిలో నిలిచేందుకు కారణమైన టీవీ ఇండస్ట్రీకి తాను ఎన్నటికీ కృతజ్ఞతగా ఉంటానని చెప్పింది.


అయితే, సినిమాలు ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పుడు చేస్తానని భావించి.. గోల్డ్‌ సినిమాకు సైన్‌ చేసినట్లు తెలిపింది. ఇందులో తన పాత్ర రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉంటుందని.. అందుకే సరిగ్గా సరిపోతానని భావించడంతో ఒకే చెప్పానని తెలిపింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల ఆడిషన్స్‌కు వెళ్లాలనని.. లుక్‌ టెస్ట్‌ చేసి షార్ట్‌లిస్ట్‌ చేసిన వాళ్లలో నేను రెండో స్థానంలో నిలిచిన సందర్భాలున్నాయని.. అంతగా అవకాశాలు వచ్చేవి పేర్కొంది. సరైన కారణాలు ఉండేవి కావని.. పరిశ్రమ ఇలాగే ఉంటుందని ఆ సందర్భంలో తనకు అర్థమైందని పేర్కొంది. అయితే, ఏది జరిగినా, చేదు అనుభవాలు ఎదురైనా మనం ముందుకే సాగాలని సూచించింది. తాను ప్రస్తుతం చేయాలనుకున్నది చేయగలుగుతున్నానంటే తన అదృష్టమని.. తాను పడిన కష్టం, విధి ఈ విషయాన్ని అందించాంటూ మౌనీ రాయ్‌ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మౌనీ రాయ్‌ ‘ది వర్జిన్‌ ట్రీ’ సినిమాలో నటిస్తున్నది. సంజయ్‌ దత్‌, సన్నీ సింగ్‌, పాలక్‌ తివారీ, అసిఫ్‌ ఖాన్‌ ఇందులో కీలకపాత్రలో పోషించనున్నారు.