Nalgonda | తిరుమలగిరిలో అరెస్టుల పర్వం.! ఎమ్మెల్యే గాదరికి వ్యతిరేకంగా నిరసనలు భగ్నం!!
Nalgonda విధాత: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాదిగల పట్ల చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, న్యాయవాది యుగంధర్ పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుమలగిరి మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అఖిలపక్ష పార్టీలు కాంగ్రెస్, బిజెపి, వైఎస్ఆర్ టిపి, బీఎస్పీ, డిఎస్పీ, టీజేఎస్, సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీ, ఎంఆర్పిఎస్ ల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలను, దీక్షను పోలీసులు […]

Nalgonda
విధాత: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాదిగల పట్ల చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, న్యాయవాది యుగంధర్ పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుమలగిరి మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
అఖిలపక్ష పార్టీలు కాంగ్రెస్, బిజెపి, వైఎస్ఆర్ టిపి, బీఎస్పీ, డిఎస్పీ, టీజేఎస్, సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీ, ఎంఆర్పిఎస్ ల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలను, దీక్షను పోలీసులు అడ్డుకొని ఎక్కడికక్కడే నిరసనకారులను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. అఖిలపక్షాల నిరసన దీక్ష కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆర్టీసీ బస్సులో వస్తున్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ను అరెస్ట్ చేసి, అర్వపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల ముందస్తు అరెస్టు నేపథ్యంలో హైదరాబాదులోని ఆగిపోయారు. బిజెపి నేత కడియం రామచంద్రయ్యను తుంగతుర్తి లోనే అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు అరెస్టులను, నిర్భంధాలను దాటి తిరుమలగిరి చేరుకున్న వివిధ పార్టీల నాయకులను, కార్యకర్తలను స్థానికంగా పోలీసులు అరెస్ట్ చేసి వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిగా మారారని ఆరోపించారు. ఆయన అరాచకాలకు, ఆగడాలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.
కార్యక్రమంలో వైఎస్ఆర్ టిపి నేత ఏపూరి సోమన్న, కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గుడిపాటి నరసయ్య, డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న, నాయకులు జ్ఞానేశ్వర్, నాగరిగారి ప్రీతం సహా వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.