Nalgonda | నల్లగొండ క్లబ్ అభివృద్ధి అభినందనీయం: ZP చైర్మన్ బండా, MLA కంచర్ల
Nalgonda ఫ్యామిలీ రెస్టారెంట్, బాంకెట్ హాల్ ప్రారంభించిన జడ్పి చైర్మన్ బండా, ఎమ్మెల్యే కంచర్ల విధాత: నల్లగొండ పట్టణ అభివృద్ధికి అనుగుణంగా నల్లగొండ క్లబ్ ను కూడా సకల సౌకర్యాలతో తీర్చిదిద్దడం అభినందనీయమని జడ్పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ క్లబ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ రెస్టారెంట్ తో పాటు ఫంక్షన్స్ కోసం రూపుదిద్దిన బంకెట్ హాల్ ను ఎమ్మెల్యే కంచర్ల తో కలిసి జడ్పి […]

Nalgonda
- ఫ్యామిలీ రెస్టారెంట్, బాంకెట్ హాల్ ప్రారంభించిన జడ్పి చైర్మన్ బండా, ఎమ్మెల్యే కంచర్ల
విధాత: నల్లగొండ పట్టణ అభివృద్ధికి అనుగుణంగా నల్లగొండ క్లబ్ ను కూడా సకల సౌకర్యాలతో తీర్చిదిద్దడం అభినందనీయమని జడ్పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ క్లబ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ రెస్టారెంట్ తో పాటు ఫంక్షన్స్ కోసం రూపుదిద్దిన బంకెట్ హాల్ ను ఎమ్మెల్యే కంచర్ల తో కలిసి జడ్పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్బంగా జడ్పి చైర్మన్ బండ మాట్లాడుతూ నల్లగొండ క్లబ్ నల్లగొండ పట్టణానికి అదనపు ఆకర్షణ అని, క్లబ్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో ఇతర క్లబ్ లకు సాధ్యం కానీ విధంగా స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్, జిమ్, పచ్చటి వాతావరణంతో ఆహ్లాదకరంగా ఉంటుందని అభినందించారు. ప్రస్తుతం ఫ్యామిలీ రెస్టారెంట్, మీటింగ్స్ అండ్ ఫంక్షన్స్ కోసం బాంకెట్ హాల్ ను అందుబాటులోకి తేవడం మంచి పరిణామమన్నారు. క్లబ్ సభ్యుడిగా అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు.
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ పట్టణాన్ని సీఎం కెసిఆర్ సహకారంతో 1200 కోట్లతో సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. రోడ్లు, ముఖ్య కూడళ్ళు, పార్కుల పనులు ఇప్పటికే పూర్తి కావచ్చాయన్నారు. మెడికల్ కాలేజి, ఐటి హబ్, ఎన్జీ కాలేజి నూతన భవనాలు శరవేగంగా పూర్తి అవుతున్నాయని చెప్పారు. పట్టణంలోకి వచ్చే మర్రిగూడ, పానగల్ బైపాస్ వద్ద రెండు ఫ్లై ఓవర్ల పనులు కూడా జరుగుతున్నాయని, త్వరలో మరో 900 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.
పట్టణ అభివృద్ధికి అనుగుణంగా నల్లగొండ క్లబ్ ను తీర్చిదిద్దడం సంతోషకరమన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ రెస్టారెంట్, బంకెట్ హాల్ తో పాటు రానున్న కాలంలో వసతి గదులను కూడ నిర్మించేలా చూడాలన్నారు. రాష్ట్రంలోనే నల్లగొండ క్లబ్ ను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు.
కార్యక్రమానికి అధ్యకత వహించిన క్లబ్ సెక్రటరీ గోలి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ కు చెందిన లక్ష్మణ్ రెడ్డి, సందీప్ రావుల భాగస్వామ్యంతో క్లబ్ లో ఫ్యామిలీ రెస్టారెంట్, బంకెట్ హల్ ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. క్లబ్ సభ్యులతో పాటు పట్టణ ప్రజలు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 65 సంవత్సరాల క్లబ్ ప్రగతి ప్రస్థానంలో 700 మంది క్లబ్ సభ్యుల సహకారంతో మునుముందు మరిన్ని మౌలిక వసతులను కల్పిస్తామన్నారు.
కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెగట్టే మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ ఊట్కూరి వెంకట్ రెడ్డి, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఏంవి గోనారెడ్డి, క్లబ్ ప్రముఖులు బండా దామోదర్ రెడ్డి, సోమగాని శంకర్ గౌడ్, బొర్రా సుధాకర్, వెంకటనర్సయ్య, క్లబ్ పాలకవర్గం సభ్యులు, క్లబ్ ఫ్రాంచైజీలు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి, సందీప్ రావు, క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.