ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నిందితుడు నందుకుమార్ హోట‌ల్ కూల్చివేత‌

Nandu Kumar | విధాత: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం తెలంగాణ‌తో పాటు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ కేసును ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్) విచారిస్తోంది. ఇప్ప‌టికే ఈ కేసులో అరెస్టు అయి చంచ‌ల్‌గూడ జైల్లో ఉంటున్న రామ‌చంద్ర భార‌తి, సింహాయాజి, నందుకుమార్‌ను సిట్ ప్ర‌శ్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మ‌రో ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేంటంటే.. హైద‌రాబాద్‌కు చెందిన నందుకుమార్ డెక్క‌న్ హోట‌ల్ భ‌వ‌నాన్ని జీహెచ్ఎంసీ అధికారులు […]

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నిందితుడు నందుకుమార్ హోట‌ల్ కూల్చివేత‌

Nandu Kumar | విధాత: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం తెలంగాణ‌తో పాటు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ కేసును ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్) విచారిస్తోంది. ఇప్ప‌టికే ఈ కేసులో అరెస్టు అయి చంచ‌ల్‌గూడ జైల్లో ఉంటున్న రామ‌చంద్ర భార‌తి, సింహాయాజి, నందుకుమార్‌ను సిట్ ప్ర‌శ్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మ‌రో ట్విస్ట్ చోటు చేసుకుంది.

అదేంటంటే.. హైద‌రాబాద్‌కు చెందిన నందుకుమార్ డెక్క‌న్ హోట‌ల్ భ‌వ‌నాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. ఫిల్మ్ న‌గ‌ర్‌లో నందుకుమార్ స్థలాన్ని లీజుకు తీసుకుని అక్రమ నిర్మణాలు చేపడతున్నాడని, అందువల్లే కూల్చేసిన‌ట్లు జీహెచ్ఎంసీ అధికారులు స్ప‌ష్టం చేశారు.

అయితే ఈ హోట‌ల్ కూల్చివేత‌ను నందుకుమార్ భార్య చిత్ర అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండానే భ‌వ‌నాన్ని కూల్చేయ‌డం స‌రికాద‌ని, అన్ని ఆధారాలను అధికారులకు అందిస్తామని చిత్ర పేర్కొన్నారు.