Lokesh | తల్లితో కలిసి నేడు ఢిల్లీకి లోకేష్.. ఏపీ పరిస్థితులపై జాతీయ మీడియాకు ప్రజెంటేషన్?
Lokesh ఏపీలో పరిస్థితులపై జాతీయ మీడియాకు ప్రజెంటేషన్? హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం! విధాత : ఏపీలోని రాజకీయ పరిస్థితులు, చంద్రబాబు అరెస్టుపై జాతీయ మీడియాకు వెల్లడించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. తన తల్లి భువనేశ్వరితో కలిసి శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో జాతీయ స్థాయిలో స్పందన వచ్చింది. చంద్రబాబును రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని అనేక పార్టీల నేతలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో దాడులు చేసిన […]

Lokesh
- ఏపీలో పరిస్థితులపై జాతీయ మీడియాకు ప్రజెంటేషన్?
- హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం!
విధాత : ఏపీలోని రాజకీయ పరిస్థితులు, చంద్రబాబు అరెస్టుపై జాతీయ మీడియాకు వెల్లడించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. తన తల్లి భువనేశ్వరితో కలిసి శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో జాతీయ స్థాయిలో స్పందన వచ్చింది. చంద్రబాబును రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని అనేక పార్టీల నేతలు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపైనే కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నాయి. నాలుగేళ్ల కాలంలో ఏపీలో జరిగినన్ని అరాచకాలు దేశంలో ఎక్కడా జరిగి ఉండవని.. వాటన్నింటినీ మీడియాకు వివరించాలని లోకేశ్ అనుకుంటున్నారని సమాచారం.
టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారిపై ఒక్క కేసు కూడా పెట్టకపోవడం.. అంగళ్లు, పుంగనూరులో చంద్రబాబు ర్యాలీపై రాళ్ల దాడులు చేసి.. తిరిగి చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేయడం వంటి వాటిని.. లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పిన పరిస్థితుల్ని జాతీయస్థాయిలో హైలెట్ చేయాలని లోకేష్ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం
కుదిరితే హోంమంత్రి అమిత్ షాను కూడా లోకేశ్, భువనేశ్వరి కలుస్తారని సమాచారం. ఈ అంశంపై స్పష్టత లేదు. కానీ ఏపీలో పరిస్థితుల్ని ఢిల్లీలో అందరి ముందు పెట్టాలని నారా లోకేష్ గట్టిగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది