Luna-25 | చంద్రుడి బుగ్గపై రష్యా మచ్చ! పడింది.. 10 మీటర్ల గొయ్యి

Luna-25 | విధాత: శతకోటి శంభు లింగాల్లో ఓ బోడి లింగం అన్నట్టుగా.. అక్కడి లక్షలాది గుంతల్లో ఇదొకటి. రష్యా ల్యాండర్ ‘లూనా-25’ కూలిపోయిన ప్రదేశం ఇదిగో. చంద్రుడిపై దిగే ముందుగా గత నెల 19న కక్ష్య మార్పు సందర్భంగా నియంత్రణ కోల్పోయి ల్యాండర్ కూలిన సంగతి తెలిసిందే. అది ఫలానా చోట కూలిపోయి ఉంటుందని అంచనా వేసిన ప్రదేశం సమీపంలోనే తాజా గొయ్యి ఉంది. NASA has released a Set of Images showing […]

  • By: Somu    latest    Sep 01, 2023 11:11 AM IST
Luna-25 | చంద్రుడి బుగ్గపై రష్యా మచ్చ! పడింది.. 10 మీటర్ల గొయ్యి

Luna-25 |

విధాత: శతకోటి శంభు లింగాల్లో ఓ బోడి లింగం అన్నట్టుగా.. అక్కడి లక్షలాది గుంతల్లో ఇదొకటి. రష్యా ల్యాండర్ ‘లూనా-25’ కూలిపోయిన ప్రదేశం ఇదిగో. చంద్రుడిపై దిగే ముందుగా గత నెల 19న కక్ష్య మార్పు సందర్భంగా నియంత్రణ కోల్పోయి ల్యాండర్ కూలిన సంగతి తెలిసిందే. అది ఫలానా చోట కూలిపోయి ఉంటుందని అంచనా వేసిన ప్రదేశం సమీపంలోనే తాజా గొయ్యి ఉంది.

జాబిలి ఉపరితలంపై కొత్తగా ఏర్పడిన ఈ బిలాన్ని, ప్రస్తుతం చంద్ర కక్ష్యలోనే పరిభ్రమిస్తూ సేవలందిస్తున్న అమెరికా ఉపగ్రహం ‘లూనార్ రీకానసన్స్ ఆర్బిటర్’ (ఎల్ఆర్ఓ) గుర్తించి ఫొటోలు తీసింది.

32 అడుగుల వ్యాసంతో ఉన్న ఈ నూతన బిలం చంద్రుడి ‘సహజ బిలం’ కాదని, బహుశా… చంద్రుడిని ‘లూనా-2’ ల్యాండర్ గుద్దుకోవడం వల్లనే ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. అప్పట్లో మన చంద్రయాన్-2 ల్యాండర్ ‘విక్రమ్’ చంద్రుడిపై కూలి ధ్వంసమైన తర్వాత ఆ బిలం ఫొటోలను కూడా ‘లూనార్ రీకానసన్స్ ఆర్బిటర్’ భూమికి ప్రసారం చేసింది.