మిర్యాలగూడలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు

పాల్గొన్న తెలంగాణ శాసనమండలి చైర్మన్, నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, స్థానిక శాసనసభ్యులు విధాత, నల్గొండ: మిర్యాలగూడ నియోజకవర్గం కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి యన్.యస్.పి క్యాంప్ మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించిగా ర్యాలీ లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం స్థానిక ఆర్టీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్యోత్సవాలలో శాసనమండలి […]

మిర్యాలగూడలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు
  • పాల్గొన్న తెలంగాణ శాసనమండలి చైర్మన్, నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, స్థానిక శాసనసభ్యులు

విధాత, నల్గొండ: మిర్యాలగూడ నియోజకవర్గం కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి యన్.యస్.పి క్యాంప్ మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించిగా ర్యాలీ లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం స్థానిక ఆర్టీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్యోత్సవాలలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి, స్థానిక శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డిలు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేశారు.

తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ నామకరణం చేసినందుకు, అంబేద్కర్ , సీఎం కెసిఆర్ ల చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రోహిత్ సింగ్, డి.ఎస్.పి వెంకటేశ్వరరావు, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వివిధ హోదాలో ఉన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.