Natu Natu Song | ఆస్కార్‌ వేదికపై ‘నాటు నాటు’ సాంగ్‌కు డ్యాన్స్‌ చేయనున్న అమెరికన్‌ డ్యాన్సర్‌..!

Natu Natu Song | దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళిక దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌ ప్రపంచవ్యాప్తంగా ఓ ఊపు ఊపింది. పాటలో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు అద్భుతంగా స్టెప్పులు వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది నటీ నటులతో పాటు ప్రముఖులు సైతం పాటకు కాళ్లు కదిపారు. ఈ పాటలు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును సైతం అందుకున్నది. ఆస్కార్‌ అవార్డుకు సైతం నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ […]

Natu Natu Song | ఆస్కార్‌ వేదికపై ‘నాటు నాటు’ సాంగ్‌కు డ్యాన్స్‌ చేయనున్న అమెరికన్‌ డ్యాన్సర్‌..!

Natu Natu Song | దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళిక దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌ ప్రపంచవ్యాప్తంగా ఓ ఊపు ఊపింది. పాటలో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు అద్భుతంగా స్టెప్పులు వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది నటీ నటులతో పాటు ప్రముఖులు సైతం పాటకు కాళ్లు కదిపారు. ఈ పాటలు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును సైతం అందుకున్నది. ఆస్కార్‌ అవార్డుకు సైతం నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ అవార్డుకు పోటీపడుతున్నది. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 95వ అకాడమీ అవార్డుల ప్రదానం జరుగనున్నది. మరికొద్ది గంటల్లో వేడుకలు అట్టహాసంగా జరుగనున్నాయి.

అయితే, వేదికపై నాటు నాటు సాంగ్‌ను లైవ్‌గా ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు ఫెర్మార్‌ చేయబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ, ఇది వాస్తవం కాదని.. అమెరికన్‌ నటి, డ్యాన్సర్‌ అయిన లారెన్ గోట్లిబ్ (Lauren Gottlieb) ‘నాటు నాటు’ సాంగ్‌తో అలరించనున్నది. దీనిపై లారెన్‌ సైతం క్లారిటీ ఇచ్చింది. ఆస్కార్‌ వేదికపై ‘నాటు నాటు’ సాంగ్‌పై ప్రదర్శన ఇవ్వబోతున్నట్లుగా సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. భారతీయ చిత్రానికి సంబంధించిన పాటకు ప్రదర్శన ఇవ్వనుండడం సంతోషంగా ఉందని తెలిపింది. లాస్ ఏంజిల్స్‌లో ప్రసిద్ధ హాలీవుడ్ సింబల్ ముందు దిగిన తన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నేను ఆస్కార్స్‌లో నాటు నాటుపై ప్రదర్శన ఇస్తున్నాను.

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి నేను సంతోషిస్తున్నాను’ తెలుపుగా.. నటిపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. లారెన్‌ గోట్లిబ్‌ అద్భుతమైన డ్యాన్స్‌. ఝలక్ దిఖ్లాజా సీజన్ 6, 2013లో ABCD : ఎనీ బడి కెన్‌ డ్యాన్స్‌ చిత్రంలో కనిపించింది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8 గంటలకు ఆస్కార్‌ వేడుకలు మొదలవనున్నాయి. భారతీయ కాలమానం ప్రకారం 5.30 గంటలకు మొదలవనున్నాయి. ఇక నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్‌ అవార్డు ఖాయమని తెలుగుతో పాటు భారతీయ అభిమానులు భావిస్తున్నారు. ఆస్కార్‌ వేదికపై భారతదేశం పేరు మారుమోగాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరో వైపు నాటు నాటు సాంగ్‌ను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కీరవాణితో కలిసి లైవ్‌లో పెర్ఫార్మ్ చేయనున్నట్లు సమాచారం.