NDA | ఎన్డీయే సభకు పవన్!! టిడిపికి డోర్స్ క్లోజ్!!
NDA విధాత: ఢిల్లీలో మంగళవారం జరిగే బిజెపి సారథ్యంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఒకరినొకరు సహకరించుకుంటూ చివరికి అధికారాన్ని అందుకోవడం.. ఆయా రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలు పరిస్థితి, సమస్యలు వంటివి ఇక్కడ చర్చిస్తారని అంటున్నారు. ఈ సభకు బిజెపి జాతీయాధ్యక్షుడు జయ ప్రకాష్ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఇంకా భాగస్వామ్య పక్షాల నుంచి ప్రధాన నాయకులు హాజరవుతున్నారు. ప్రస్తుతం బిజెపితో […]

NDA
విధాత: ఢిల్లీలో మంగళవారం జరిగే బిజెపి సారథ్యంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఒకరినొకరు సహకరించుకుంటూ చివరికి అధికారాన్ని అందుకోవడం.. ఆయా రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలు పరిస్థితి, సమస్యలు వంటివి ఇక్కడ చర్చిస్తారని అంటున్నారు. ఈ సభకు బిజెపి జాతీయాధ్యక్షుడు జయ ప్రకాష్ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఇంకా భాగస్వామ్య పక్షాల నుంచి ప్రధాన నాయకులు హాజరవుతున్నారు.
ప్రస్తుతం బిజెపితో స్నేహపూర్వకంగా ఉంటున్న పవన్ సైతం ఈ సభకు హాజరయ్యారు. టిడిపి.. బిజెపి.. జనసేనతో కూడిన కూటమిగా ఏర్పడి జగన్‌ను ఎదుర్కోవాలని పవన్ చేసిన ప్రతిపాదనను బిజేపి పెద్దలు గతంలోనే తిరస్కరించారు. కేవలం బిజెపి.. జనసేన మాత్రమే ఒక కూటమిగా ఉండాలని బిజెపి పెద్దలు భావిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు ఈ సమావేశానికి పిలుపు రాలేదు.
2014-19 మధ్య బిజెపితో పొత్తులో ఉన్న చంద్రబాబు ఆ సమయంలో మధ్యంతరంగా ఎన్డీయే నుంచి బయటికి వచ్చేసి బిజెపి అధిష్టానాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆ తరువాత 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక మళ్ళీ బిజెపి పంచన చేరడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇప్పుడు చంద్రబాబుకు ఈ సమావేశానికి పిలుపు సైతం లేదు.
బిజెపిలో ఉన్న తమ వేగులు టీజీ వెంకటేష్, సుజనా చౌదరి ద్వారా మళ్ళీ ప్యాచప్ అయ్యేలా, ఎన్డీయే సభకు పిలుపు వచ్చేలా ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇక పవన్ ఢిల్లీలో బిజెపి పెద్దలతో ఏమీ మాట్లాడతారు.. వారు ఈయనకు ఏమీ దిశా నిర్దేశం చేస్తారన్నది మంగళవారం సాయంత్రం తెలుస్తుంది.
ఈ సందర్భంగా పవన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ కేంద్ర మంత్రులు తనను స్వయంగా ఈ సభకు ఆహ్వానించడంతో తనకు సంతోషాన్నిచ్చింది అంటూ ఆ సమావేశానికి వెళుతున్నానని అన్నారు. ఆయన వెంట నాదెండ్ల మనోహర్ సైతం ఢిల్లీ వెళ్లారు.