పోలీసులు, వైద్యశాఖ నిర్లక్ష్యం.. మార్చురీలో కుల్లిన యువ‌కుడి మృతదేహం!

కుటుంబసభ్యులకు తెలియని సమాచారం సంగారెడ్డి ఆసుపత్రి ముందు బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన పోలీసులు, బాధితుల మ‌ధ్య వాగ్వాదం స్పందించిన మంత్రి హరీష్ రావు విచారణ చేప‌ట్టాల‌ని కలెక్టర్ శరత్‌కు ఆదేశం.. అంబులెన్స్ లో మృత‌దేహాన్ని గ్రామానికి తరలించిన పోలీసులు విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: పోలీసుల నిర్లక్ష్యంతో ఓ యువకుడి మృత‌దేహం 15 రోజులుగా మార్చురీలో కుల్లి పోవాల్సి వచ్చింది. జేబులో ఆధార్ కార్డు ఉన్నప్పటికీ పోలీసులు కానీ, వైద్య సిబ్బంది కానీ గుర్తించకపోవడం […]

  • By: krs    latest    Jan 06, 2023 11:38 AM IST
పోలీసులు, వైద్యశాఖ నిర్లక్ష్యం.. మార్చురీలో కుల్లిన యువ‌కుడి మృతదేహం!
  • కుటుంబసభ్యులకు తెలియని సమాచారం
  • సంగారెడ్డి ఆసుపత్రి ముందు బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన
  • పోలీసులు, బాధితుల మ‌ధ్య వాగ్వాదం
  • స్పందించిన మంత్రి హరీష్ రావు
  • విచారణ చేప‌ట్టాల‌ని కలెక్టర్ శరత్‌కు ఆదేశం..
  • అంబులెన్స్ లో మృత‌దేహాన్ని గ్రామానికి తరలించిన పోలీసులు

విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: పోలీసుల నిర్లక్ష్యంతో ఓ యువకుడి మృత‌దేహం 15 రోజులుగా మార్చురీలో కుల్లి పోవాల్సి వచ్చింది. జేబులో ఆధార్ కార్డు ఉన్నప్పటికీ పోలీసులు కానీ, వైద్య సిబ్బంది కానీ గుర్తించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

రోడ్డు ప్రమాదంలో గాయప‌డిన ఆ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందగా గుర్తు తెలియని వ్యక్తిగా మృతదేహాన్ని మార్చురిలో ఉంచారు. శవం కుళ్లిన తర్వాత జేబులో చూస్తే ఆధార్ కార్డు కనిపించింది. అప్పుడు కుటుంబ సభ్యులకు సమచారం అందించారు.

వివరాల్లోకి వెళితే గత నెల డిసెంబర్18 న పులకల్ మండలం సుల్తాన్ పూర్ వద్ద రోడ్ ప్రమాదం లో గుర్తు తెలియని వ్యక్తి 28 తీవ్రగాయాలు కాగా108 సిబ్బంది సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు 108 సిబ్బంది, పుల్కల్ పోలీస్ లకు సమాచారం ఇచ్చారు. 18 నుండి 22 వ తేదీ వరకు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందించారు.

చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందాడు. అదే రోజు శవాన్ని మార్చురీకి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి గా భావించారు. కాగా శవం పూర్తిగా కుల్లి పోయింది. మృతుడి జేబులో చూస్తే ఆధార్ కార్డు కనిపించింది…. అందులో శ్రీనివాస్, జారసంగం మండలం కృష్ణపూర్ గ్రామంగా గుర్తించారు.. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకొని ఆందోళన చేపట్టారు.

బాధితులపై చేయి చేసుకున్న పోలీసులు…. పోలీస్ లపై ప్రతి దాడి

పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే బాధితులు సంగారెడ్డి ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు, బాధితులకు మ‌ధ్య‌ వాగ్వివాదం చోటుచేసుకుంది. రెచ్చిపోయిన పోలీసులు బాధితుల పై చేయి చేసుకున్నారు.

దీంతో ఆగ్రహంగా ఉన్న బాధితుని కుటుంబ సభ్యులు అక్కడున్న పోలీసు సిబ్బందిపై తిరగబడ్డారు. పోలీసులు లాఠీచార్జి చేసి, ఆందోళ‌న‌ను చెద‌రగొట్టి మృత‌దేహాన్ని స్వగ్రామానికి అంబులెన్స్ లో తరలించి, బాధితులను పంపించివేశారు.

విచారణకు ఆదేశించిన మంత్రి హరీష్ రావు..

బాధితులు మంత్రి హరీష్ రావుకు విన్నవించడంతో సానుకూలంగా స్పందించారు. ఈ సంఘటనపై విచారణ చేప‌ట్టాల‌ని మంత్రి హరీష్ రావు క‌లెక్ట‌ర్‌కు ఆదేశించారు. ఈ ఘటనలో పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందనీ విచారణ జరిపిన త‌ర్వాత‌ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి జిల్లా కలెక్టర్ శరత్ కు ఆదేశాలు జారీచేశారు.