‘నీరో’ మీ కంటే బెటర్: నారా లోకేష్
ట్విట్టర్ వేదికగా లోకేష్ విమర్శలు విధాత: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా విశాఖపట్నం నుండి 120 కిలోమీటర్లు బైక్ పై మృతదేహాన్ని తీసుకెళ్లిన ఘటనపై లోకేష్ స్పందించారు. "రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో మీకంటే బెటర్ పబ్జీ ప్లేయర్ గారూ! పసిగుడ్డు మృతదేహాన్ని విశాఖ నుంచి 120 కిలోమీటర్లు బైకుపై పాడేరు తీసుకెళ్లిన […]

ట్విట్టర్ వేదికగా లోకేష్ విమర్శలు
విధాత: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా విశాఖపట్నం నుండి 120 కిలోమీటర్లు బైక్ పై మృతదేహాన్ని తీసుకెళ్లిన ఘటనపై లోకేష్ స్పందించారు. “రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో మీకంటే బెటర్ పబ్జీ ప్లేయర్ గారూ! పసిగుడ్డు మృతదేహాన్ని విశాఖ నుంచి 120 కిలోమీటర్లు బైకుపై పాడేరు తీసుకెళ్లిన ఆ తల్లిదండ్రుల కష్టం విన్న మాకే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
రోజుకో అమానవీయ ఘటన, పూటకో దయనీయ దృశ్యం మీ దరిద్రపాలనలో సర్వసాధారణమైపోయాయి. వైద్యానికి వెళితే నిర్లక్ష్యం. చనిపోయిన వారిని తరలించేందుకు అంబులెన్సులు రావు. నిరుపేదలు చనిపోతే అనాథ శవాల్లా పడి వుండడమేనా?(2/2)#IdhemKarmaManaRashtraniki
— Lokesh Nara (@naralokesh) February 16, 2023
మీ కరకు గుండె మాత్రం కరగదు.” అంటూ పేర్కొన్నారు. రోజుకో అమానవీయ ఘటన, పూటకో దయనీయ దృశ్యం మీ దరిద్రపాలనలో సర్వసాధారణమైపోయాయని, వైద్యానికి వెళితే నిర్లక్ష్యం.. చనిపోయిన వారిని తరలించేందుకు అంబులెన్సులు రావని, నిరుపేదలు చనిపోతే అనాథ శవాల్లా పడి వుండడమేనా? అంటూ ప్రశ్నించారు.