త్రిష ‘బ్రాహ్మణుల’ వ్యాఖ్యలు.. మండిపడుతున్న నెటిజన్లు
విధాత: త్రిషా కృష్ణన్.. ఈమె నాలుగు పదుల వయసులో కూడా వరుస చిత్రాలు చేసుకుని వెళ్తుంది. ఈమె కెరీర్ ఇక అయిపోయింది అనుకున్న ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌ను పక్కన పెట్టి ఈమె పూర్తిగా కోలీవుడ్‌పై దృష్టి సారించింది. ఇటీవల నటించిన పొన్నియిన్ సెల్వన్1 విడుదలై ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం రాంగీ చిత్రం ప్రమోషన్లలో బిజీగా ఉంది. దీని తర్వాత ఆమె శతురంగ వెట్టై 2, పొన్నియిన్ సెల్వన్ 2, ది రోడ్ వంటి […]

విధాత: త్రిషా కృష్ణన్.. ఈమె నాలుగు పదుల వయసులో కూడా వరుస చిత్రాలు చేసుకుని వెళ్తుంది. ఈమె కెరీర్ ఇక అయిపోయింది అనుకున్న ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌ను పక్కన పెట్టి ఈమె పూర్తిగా కోలీవుడ్‌పై దృష్టి సారించింది. ఇటీవల నటించిన పొన్నియిన్ సెల్వన్1 విడుదలై ఘనవిజయం సాధించింది.
ప్రస్తుతం రాంగీ చిత్రం ప్రమోషన్లలో బిజీగా ఉంది. దీని తర్వాత ఆమె శతురంగ వెట్టై 2, పొన్నియిన్ సెల్వన్ 2, ది రోడ్ వంటి తమిళ చిత్రాలలో నటిస్తోంది. మలయాళంలో ఈమె రామ్ అనే చిత్రంలో కూడా నటిస్తూ ఉండడం విశేషం. ఇలా నాలుగైదు చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది.
డిసెంబర్ 30న విడుదలైన తమిళ చిత్రం రాంగి ప్రమోషన్లలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు నెటిజన్లకు కోపం తెస్తున్నాయి. దాంతో త్రిషను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం అని అడిగితే నాకు సౌత్ ఇండియన్ హోమ్ ఫుడ్ అంటే ఇష్టం. అందులో బ్రాహ్మణుల ఇంటి భోజనాన్ని బాగా ఇష్టపడతానని సమాధానం ఇచ్చింది.
అయితే ఇందులో తనకు నచ్చిన ఫుడ్ చెబితే బాగుండేది కదా అందులో కులాన్ని నొక్కి చెప్పడం ఎందుకు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇష్టా ఇష్టాలను తెలియజేయడంలో కులాన్ని తీసుకురావడం అనవసరం అంటూ మండి పడుతున్నారు.
కానీ త్రిష ఫ్యాన్స్ మాత్రం ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు. తనకు అనిపించింది చెప్పింది. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం ఏ మాత్రం సరికాదు.. ఎంత సెలబ్రెటీ అయినంత మాత్రాన ప్రతిదానికి విమర్శలు గుప్పించడం సరికాదు అంటున్నారు.
అయినా ఏ కులం వారు హోటల్ పెట్టినా పూర్తి శాఖాహార భోజనానికి బ్రాహ్మణ హోటల్ అని అంటూ ఉంటారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు త్రిష చెబితే ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అని కొందరు.. నెటిజన్ల వైఖరిని తప్పు పడుతున్నారు.