ఈ క్రెడిట్‌కార్డులు వాడుతున్నారా? ఈ రూల్స్‌ మారాయని మీకు తెలుసా?

ప్రస్తుత కాలంలో క్రెడిట్‌కార్డుల వినియోగం విపరీతంగా పెరిగింది. బ్యాంకులతో పాటు ఆర్థిక సంస్థలు పెద్ద ఎత్తున కార్డులను జారీ చేస్తున్నాయి

ఈ క్రెడిట్‌కార్డులు వాడుతున్నారా? ఈ రూల్స్‌ మారాయని మీకు తెలుసా?

Credit Card Rules | ప్రస్తుత కాలంలో క్రెడిట్‌కార్డుల వినియోగం విపరీతంగా పెరిగింది. బ్యాంకులతో పాటు ఆర్థిక సంస్థలు పెద్ద ఎత్తున కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే, బ్యాంకులు ఎప్పటికప్పుడు క్రెడిట్‌కార్డుల రూల్స్‌ను మార్చేస్తుంటాయి. తాజాగా పలు బ్యాంకులు ఎంపిక చేసిన కార్డులపై నిబంధనలను మార్చాయి. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు పలు కార్డుల రూల్స్‌ను మార్చేశాయి. అవేంటో చూసేద్దాం రండి..!


రెగాలియా, మిలీనియా కార్డుల్లో మార్పులు చేసిన హెచ్‌డీఎఫ్‌సీ


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రెగాలియా, మిలీనియా క్రెడిట్‌కార్డుల్లో కీలక మార్పులు తీసుకువచ్చింది. ఈ నిబంధనలు డిసెంబర్‌ నుంచి మార్పులు చేసింది. క్రెడిట్ కార్డ్ స్పెండింగ్‌ను బట్టి లాంజ్ యాక్సెస్ ప్రోగ్రామ్ తీసుకువచ్చింది. ప్రతి క్యాలెండర్‌ ఇయర్‌లో మూడునెలలకోసారి రూ.లక్ష.. లేదంటే ఎక్కువగా కార్డును వాడాల్సి ఉంటుంది.


ఆ తర్వాత రెగాలియా స్మార్ట్‌బై పేజ్‌లో లాంజ్ బెనిఫిట్స్‌లోకి యాక్సెస్‌ వోచర్‌ను పొందేందుకు వీలుంటుంది. ప్రతి త్రైమాసికానికి రెండు కాంప్లిమెంటరీ లాంజ్‌ వోచర్స్‌ పొందే వీలుంది. అలాగే మిలీనియా క్రెడిట్‌కార్డుపై సైతం ఇలాంటి మార్పులే చేయగా.. కేవలం ఒకే వోచర్‌ అందుబాటులో ఉంటుంది.


ఎస్‌బీఐ కార్డులోనూ మార్పులు..


ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సైతం క్రెడిట్‌కార్డుల్లో కీలక మార్పులే చేసింది. పేటీఎం ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులో రెంట్ పేమెంట్ ట్రాన్సాక్షన్లపై క్యాష్‌బ్యాక్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ నిబంధన ఈ ఏడాది జనవరి ఒకటో తేఈ నుంచి అమలులోకి వచ్చింది. ఇంతకు ముందు నవంబర్‌ ఒకటో తేదీన రివార్డుల్లో పాయింట్లలోనూ పలు మార్పులు చేసింది.


టర్మ్‌ కండిషన్స్‌ మార్చిన యాక్సిస్ బ్యాంక్


యాక్సిస్ బ్యాంకు సైతం క్రెడిట్‌కార్డు వినియోగదారులకు కీలక సూచనలు చేసింది. యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డు బెనిఫిట్స్, యాన్యువల్ ఫీజు, జాయినింగ్ గిఫ్ట్స్ నిబంధనలను మార్చింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ రిజర్వ్ క్రెడిట్ కార్డ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా సవరించింది.


21 కార్డుల్లో ఐసీఐసీఐ మార్పులు..


ఐసీఐసీఐ బ్యాంకు సైతం త్వరలో 21 క్రెడిట్ కార్డులకు సంబంధించి కీలక మార్పులు చేయబోతున్నది. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నది. ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ బెనిఫిట్స్, రివార్డ్ పాయింట్ రూల్స్‌లో నిబంధనలను మార్చబోతున్నట్లు తెలుస్తున్నది.