Ind vs Pak | క్రేజీ అప్‌డేట్.. అమెరికాలో ఇండియా వ‌ర్సెస్ పాక్ టీ20!

Ind vs Pak | ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఈ రెండు దేశాల‌తో పాటు ఇత‌ర దేశాలకి చెందిన ప్రేక్ష‌కుల‌లో ఎంత ఉత్కంఠ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఐసీసీ టోర్న‌మెంట్స్‌లో మాత్ర‌మే ఈ రెండు జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. రీసెంట్‌గా ఆసియా క‌ప్‌లో ఈ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డ‌గా, టీమిండియా త‌న డామినేష‌న్ చూపించింది. క్రికెట్ ప్రపంచంలో హై వోల్టేజ్ మ్యాచ్ గా పిల‌వ‌బ‌డే ఇండియా పాక్ మ్యాచ్ ను ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ […]

  • By: sn    latest    Sep 20, 2023 7:09 AM IST
Ind vs Pak | క్రేజీ అప్‌డేట్.. అమెరికాలో ఇండియా వ‌ర్సెస్ పాక్ టీ20!

Ind vs Pak |

ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఈ రెండు దేశాల‌తో పాటు ఇత‌ర దేశాలకి చెందిన ప్రేక్ష‌కుల‌లో ఎంత ఉత్కంఠ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఐసీసీ టోర్న‌మెంట్స్‌లో మాత్ర‌మే ఈ రెండు జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. రీసెంట్‌గా ఆసియా క‌ప్‌లో ఈ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డ‌గా, టీమిండియా త‌న డామినేష‌న్ చూపించింది.

క్రికెట్ ప్రపంచంలో హై వోల్టేజ్ మ్యాచ్ గా పిల‌వ‌బ‌డే ఇండియా పాక్ మ్యాచ్ ను ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా చూడటానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. వన్ డే వరల్డ్ కప్ ద్వారా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూసే అవకాశం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు మ‌రోసారి క‌ల‌గ‌నుంది. అయితే వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జ‌ర‌గ‌నుండ‌గా, ఈ సిరీస్‌లో కూడా ఇండియా పాక్ త‌ల‌ప‌డ‌నున్నాయి.

అమెరికాలోని న్యూయార్కులో హై వోల్టేజ్ మ్యాచ్ నిర్వహించాలని ఐసీసీ ప్లాన్ చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ నిర్వహించేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా త‌గు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు స‌మాచారం. టీ వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కులు వెస్టిండీస్, అమెరికాలకు దక్కగా, అసలు క్రికెట్‌కి పెద్దగా ఆదరణ లేని అమెరికాలో అటు దాయాదుల పోరు జ‌రిగితే ఎలా ఉంటుందా అని ప్ర‌తి ఒక్క‌రూ ఆలోచ‌న‌లు చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే వీరి మ్యాచ్ కోసం స్టేడియం దొరకని పరిస్థితి ఏర్పడిందనే టాక్ కూడా ఒక‌టి న‌డుస్తుంది. వరల్డ్ కప్ మ్యాచ్‌లు నిర్వహించే క్రికెట్ వసతులు ఉన్న స్టేడియం అమెరికాలో లేద‌ని అంటున్నారు. సాధార‌ణంగా ఇండియా, పాకిస్తాన్ లాంటి హై వోల్టేజ్ మ్యాచ్ కి భారీ ఎత్తున వీక్ష‌కులు హాజ‌ర‌య్యే అవకాశం ఉంది. మ‌రి అంత‌మందికి సరిపడా స్టేడియం ఒకటి కూడా దొరకట్లేదు.

వరల్డ్ కప్ కోసం త‌క్కువ సమయం ఉన్న ఇప్పటికి కూడా అటు పాక్ vs ఇండియా మ్యాచ్ కోసం వేదికనేది ఫిక్స్ చేయలేద‌ని అంటున్నారు. న్యూయార్క్ ను ఆనుకొని ఉండే బ్రాంక్స్ లో 34,000 మంది కూర్చుని మ్యాచ్ చూసే విధంగా ఒక కొత్త స్టేడియం నిర్మించాలని ఐసిసి ప్లాన్ చేస్తుంద‌నేప్ర‌చారం కూడా ఒక‌టి ఉంది. ఇప్పుడు దీని నిర్మాణం కూడా మొద‌లైంద‌ని, త్వ‌ర‌లోనే పూర్తి చేసి ఇండియా, పాక్ మ్యాచ్ అక్క‌డ జ‌రిపించాల‌ని ఐసీసీ అనుకుంటుంద‌ట‌. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.