Niharika: నిహారికని మరచిపోలేకపోతున్న చైతన్య.. మనశ్శాంతి కోసం అంత దూరం వెళ్లాడా..!
Niharika: గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో నిహారిక, జొన్నలగడ్డ చైతన్యల విడాకులకి సంబంధించి అనేక ప్రచారాలు సాగుతున్నాయి. కొన్నేళ్ల క్రితం తన తల్లిదండ్రులు చూపించిన జొన్నలగడ్డ చైతన్య అనే యువకుడిని నిహారిక వివాహం చేసుకంది. వీరి పెళ్లి రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా, అల్లు ఫ్యామిలీతో పాటు పలువురు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పెళ్లిలో సందడి చేశారు. పెళ్లి అయి పట్టుమని ఐదేళ్లు కూడా కాలేదు. వారిద్దరు విడిపోతున్నారు అని జోరుగా ప్రచారాలు […]

Niharika: గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో నిహారిక, జొన్నలగడ్డ చైతన్యల విడాకులకి సంబంధించి అనేక ప్రచారాలు సాగుతున్నాయి. కొన్నేళ్ల క్రితం తన తల్లిదండ్రులు చూపించిన జొన్నలగడ్డ చైతన్య అనే యువకుడిని నిహారిక వివాహం చేసుకంది. వీరి పెళ్లి రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా, అల్లు ఫ్యామిలీతో పాటు పలువురు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పెళ్లిలో సందడి చేశారు. పెళ్లి అయి పట్టుమని ఐదేళ్లు కూడా కాలేదు. వారిద్దరు విడిపోతున్నారు అని జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు కాని హింట్స్ అయితే ఇస్తూ వస్తున్నారు.
నిహారిక,చైతన్య ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడం, చైతన్య పెళ్లి ఫొటోలని డిలీట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. నిహారికతో కలిసి ఉన్న ఫోటో ఒక్కటి కూడా లేకుండా ఇన్స్టాగ్రామ్ మొత్తాన్ని క్లీన్ చేశారు. దాంతో వారిద్దరి మధ్య వివాదం నెలకొందని అందుకే ఇద్దరూ విడాకులు తీసుకున్నారని అందరు భావించారు. ఇటీవల వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ అందరికి ఓ క్లారిటీ తీసుకొచ్చంది. ఈ కార్యక్రమంలో నిహారిక సోలోగా సందడి చేసింది. ఎక్కడ కూడా చైతన్య కనిపించకపోవడంతో వారి విడాకుల విషయాన్ని నెటిజన్స్ కన్‌ఫాం చేసుకున్నారు.
ఇక తాజాగా జొన్నలగడ్డ చైతన్య దాదాపు నాలుగు నెలల తర్వాత తన సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. తన పోస్ట్‌లో ముంబైలోని గ్లోబల్ విపస్సనా పగోడా మెడిటేషన్ సెంటర్ ఫోటోలు ఉంచి ,దానికి క్యాప్షన్‌గా నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతిఒక్కరికి నా కృతజ్ఞతలు. అంచనాలు లేకుండా ఓ ప్రదేశానికి వెళ్లి తిరిగి జ్ఞానంఓ వస్తాం. కొంత మంది జీవితంలోనే ఇలా జరుగుతుంది. గత పది రోజులు నుండి విపస్సనా యోగను చేయడం వల్ల ఇప్పుడు నా లైఫ్ కొంచెం సంతోషంగా, హాయిగా ఉంది” అంటూ రాసుకొచ్చాడు చైతన్య. ఇక ఈ పోస్ట్ చూసిన చాలా మందిని నిహారికని మరచిపోలేక అక్కడికి వెళ్లాడేమో అని కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram