చైనా కీలక నిర్ణయం.. జ‌న‌వ‌రి 8 నుంచి నో క్వారంటైన్‌

విధాత‌: క‌రోనా ఆంక్షలపై చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. జీరో కొవిడ్‌ విధానానికి స్వస్తి పలుకుతున్నది. విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేసింది. జనవరి 8 నుంచి విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్‌ నిబంధన ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు విదేశీ ప్రయాణికులకు 5 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి అనే నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 8 నుంచి కరోనా నెగిటివ్‌ రిపోర్టు చూపిస్తే సరిపోతుంది. 48 గంటల ముందు కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలని చైనా ప్రభుత్వం […]

చైనా కీలక నిర్ణయం.. జ‌న‌వ‌రి 8 నుంచి నో క్వారంటైన్‌

విధాత‌: క‌రోనా ఆంక్షలపై చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. జీరో కొవిడ్‌ విధానానికి స్వస్తి పలుకుతున్నది. విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేసింది. జనవరి 8 నుంచి విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్‌ నిబంధన ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది.

ఇప్పటివరకు విదేశీ ప్రయాణికులకు 5 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి అనే నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 8 నుంచి కరోనా నెగిటివ్‌ రిపోర్టు చూపిస్తే సరిపోతుంది. 48 గంటల ముందు కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలని చైనా ప్రభుత్వం తెలిపింది.