అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంలో పిటిషన్‌.. కేంద్రానికి, రాష్ట్రాలకు నోటీసులు

డిల్లీ: తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లపై వేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ రోజు విచారించింది.ఆంధ్ర అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు పెంచాలని ప్రొఫెసర్‌ కె.పురుషోత్తంరెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఏపీ, తెలంగాణ, కేంద్రం, ఈసీని ప్రతివాదులుగా చేర్చారు. విభజన చట్టం నిబంధనలు అమలు చేసే విధంగా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన సుప్రీం ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.

  • By: krs    latest    Sep 19, 2022 12:27 PM IST
అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంలో పిటిషన్‌.. కేంద్రానికి, రాష్ట్రాలకు నోటీసులు

డిల్లీ: తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లపై వేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ రోజు విచారించింది.ఆంధ్ర అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు పెంచాలని ప్రొఫెసర్‌ కె.పురుషోత్తంరెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.

ఏపీ, తెలంగాణ, కేంద్రం, ఈసీని ప్రతివాదులుగా చేర్చారు. విభజన చట్టం నిబంధనలు అమలు చేసే విధంగా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన సుప్రీం ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.