తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌

సింగరేణిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 173 పోస్టుల భర్తీకి యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది

తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌
  • సింగరేణీలో ఖాళీల భర్తీకి చర్యలు


విధాత : సింగరేణిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 173 పోస్టుల భర్తీకి యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జూనియర్ మైనింగ్ అఫీసర్ పోస్టులు 87, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ మెకానికల్ పోస్టులు 28, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ పోస్టులు 11 సహా ఇతర విభాగాల ఉద్యగాలున్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.


మరిన్ని వివరాలకు సింగరేణి వెబ్ సైట్‌ను చూడాలని పేర్కొన్నారు. https://scclmines.com/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నియామకాలు, కొత్త నోటిఫికేషన్లను జారీ చేస్తుండటంతో నిరుద్యోగులు పోటీ పరీక్షల సన్నాహాల్లో బిజీ అవుతున్నారు.