NTR | నేడు ఎన్టీఆర్ వంద రూపాయ‌ల నాణెం విడుద‌ల‌.. పాల్గొననున్న‌ బాల‌య్య‌, జూనియ‌ర్‌

NTR | విశ్వ విఖ్యాత న‌టాసార్వభౌమ నంద‌మూరి తార‌క‌రామారావు శ‌త జ‌యంతి వేడుక‌ల‌ని ఈ ఏడాది ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకున్న విష‌యం తెలిసిందే. రాష్ట్రం,దేశం అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క చోట కూడా శ‌త జ‌యంతి ఉత్సవాలు నిర్వ‌హించారు. ఇక ఈ సంద‌ర్భంగా నేడు ఎన్టీఆర్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణేన్ని ఆయ‌న గౌర‌వార్ధం విడుద‌ల చేయ‌నుంది. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ […]

  • By: sn    latest    Aug 28, 2023 12:29 AM IST
NTR | నేడు ఎన్టీఆర్ వంద రూపాయ‌ల నాణెం విడుద‌ల‌.. పాల్గొననున్న‌ బాల‌య్య‌, జూనియ‌ర్‌

NTR |

విశ్వ విఖ్యాత న‌టాసార్వభౌమ నంద‌మూరి తార‌క‌రామారావు శ‌త జ‌యంతి వేడుక‌ల‌ని ఈ ఏడాది ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకున్న విష‌యం తెలిసిందే. రాష్ట్రం,దేశం అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క చోట కూడా శ‌త జ‌యంతి ఉత్సవాలు నిర్వ‌హించారు.

ఇక ఈ సంద‌ర్భంగా నేడు ఎన్టీఆర్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణేన్ని ఆయ‌న గౌర‌వార్ధం విడుద‌ల చేయ‌నుంది. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని ఉద‌యం 10.30ని.ల‌కి విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు, ఎంపీలు, సినీ, రాజకీయ రంగాల్లో ఆయనతో కలిసి పని చేసిన సన్నిహితులు హాజరు కాబోతున్న‌ట్టు తెలుస్తుంది. దాదాపు 200 మంది అతిథుల‌కి ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానం అందిన‌ట్టు తెలుస్తుంది.

ఇప్ప‌టికే చంద్ర‌బాబు, బాలకృష్ణ, జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్‌తో పాటు ప‌లువురు కుటుంబ స‌భ్యులు ఢిల్లీ చేరుకున్న‌ట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ వంద రూపాల నాణెం విడుద‌ల చేస్తుండ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు ఎంతో సంతోషంగా ఫీల‌వుతున్నారు.

ఇక ఈ నాణెం ప్ర‌త్యేక‌త చూస్తే.. దీని వంద శాతం లోహంతో త‌యారు చేశారు. 44 మిల్లీమీటర్ల ఈ నాణెంలో 50 శాతం సిల్వర్ (వెండి), 40 శాతం కాపర్ (రాగి) మిగతా 5, 5 శాతాల్లో నికెల్, జింక్ లోహాలతో ఉండ‌గా .. సరిగ్గా 100 శాతం లోహాలతో తయారయ్యేలా దీనిని రూపొందించిన‌ట్టు తెలుస్తుంది.

ఇక ఈ నాణెంపై ఓ వైపు 3 సింహాలతో పాటు అశోక చక్రం ఉంటుంది. మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, దాని కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో రాసి ఉంటుంది. ఈ ఏడాదితో ఎన్టీఆర్ శ‌త జ‌యంతి పూర్తి ఉంటుంది కాబ‌ట్టి 1923- 2023 అని ముద్రితమై ఉంటుంది.

కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న జన్మించిన అన్న‌గారు తెలుగువారి ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా పాకేలా చేశారు. స్వయం కృషితో సినీ, రాజకీయ రంగాలలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న ఎన్టీఆర్.. సమాజానికి అందించిన సేవలకు గాను ఆయ‌న శత జయంతి సంవత్సరం సందర్భంగా ప్రత్యేక రూ.100 నాణేన్ని ముద్రించి విడుదల చేస్తుంది కేంద్ర ఆర్థిక శాఖ.