ఎన్టీఆర్ పేరు మారిస్తే…లక్ష్మీ పార్వతి ఏం చేస్తోంది?
విధాత: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్ జగన్ ప్రభుత్వం హడావిడిగా రాత్రికిరాత్రి మార్చివేసి, వైఎస్ఆర్ పేరు పెడితే.. ఎన్టీఆర్ నా దేవుడు అంటూ పదే పదే చెప్పుకునే వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఏం చేస్తున్నారు? కనీసం ఖండిచంలేదు, తప్పు అనలేదు, ఎందుకు మార్చాల్సి వచ్చిందని అడిగిన పాపాన పోలేదని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. గత పదేళ్లుగా జగన్ పంచన చేరి ఎన్టీఆర్ ఆశయాలను కూడా నెరవేరుస్తున్నారు అంటూ ముఖ్యమంత్రి […]

విధాత: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్ జగన్ ప్రభుత్వం హడావిడిగా రాత్రికిరాత్రి మార్చివేసి, వైఎస్ఆర్ పేరు పెడితే.. ఎన్టీఆర్ నా దేవుడు అంటూ పదే పదే చెప్పుకునే వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఏం చేస్తున్నారు? కనీసం ఖండిచంలేదు, తప్పు అనలేదు, ఎందుకు మార్చాల్సి వచ్చిందని అడిగిన పాపాన పోలేదని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.
గత పదేళ్లుగా జగన్ పంచన చేరి ఎన్టీఆర్ ఆశయాలను కూడా నెరవేరుస్తున్నారు అంటూ ముఖ్యమంత్రి జగన్ను ఆకాశానికి ఎత్తేసేలా పొగిడే లక్ష్మీ పార్వతి ఈ నేమ్ ఛేంజ్ ఎపిసోడ్‌లో ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. చివరకు అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేస్తే, జగన్ ఇచ్చిన అధికార పదవికి ఇంకా రాజీనామా చేయకుండా లక్ష్మీ పార్వతి ఎందుకు సైలెంటుగా ఉంటోందన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న.
దివంగత నందమూరి తారక రామారావు ఆత్మకథ రాసే సందర్భంలో ఆయనకు దగ్గరైంది లక్ష్మీ పార్వతి. 1993, సెప్టెంబరు 10న ఎన్టీ రామారావు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించినట్టు ప్రకటించాడు. ఆ మర్నాడు అంటే సెప్టెంబరు 11న తిరుపతిలో సంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. ఎన్టీ రామారావు మరణానంతరం ఆయన జీవితచరిత్రను “ఎదురులేని మనిషి” అన్న పేరుతో 2004లో విడుదల చేసింది.