నువ్వు నాకే దక్కాలంటూ.. బావ మర్మాంగాన్ని కోసేసిన మరదలు
విధాత: ఓ మరదలు పిల్ల తన బావపై మనసు పారేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా దగ్గయ్యారు. బావ మాత్రం మరదలి కాదని, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇది సహించని మరదలు.. బావను ఇంటికి పిలిపించి, అతని మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రాజోలు మండలం తాటిపాక గ్రామానికి చెందిన ఓ యువతి తన బావపై మనసు […]

విధాత: ఓ మరదలు పిల్ల తన బావపై మనసు పారేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా దగ్గయ్యారు. బావ మాత్రం మరదలి కాదని, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇది సహించని మరదలు.. బావను ఇంటికి పిలిపించి, అతని మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజోలు మండలం తాటిపాక గ్రామానికి చెందిన ఓ యువతి తన బావపై మనసు పారేసుకుంది. మలికిపురం మండలం గూడపల్లికి చెందిన బావతో ఆమె శారీరకంగా దగ్గరైంది. ఇక సమయం దొరికినప్పుడల్లా ఇద్దరూ కలుసుకునేవారు. అయితే తన బావ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు మరదలికి తెలిసింది.
దీంతో తన ఇంట్లో ఎవరూ లేరని ఈ నెల 17న ఇంటికి బావను పిలిపించింది. నువ్వు వేరే వారితో వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నావు.. నువ్వు నాకే దక్కాలి అంటూ అతనితో వాగ్వాదానికి దిగింది. ఆవేశంతో ఊగిపోయిన మరదలు.. బ్లేడుతో బావ మర్మాంగాన్ని కోసేసింది.
తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బావను చికిత్స నిమిత్తం రాజోలు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అమలాపురం తరలించారు. కాగా బాధితుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.