30వ హనీమూన్‌లో.. ఒబామా జంట చిలిపి చేష్టలు
విధాత: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, అతని భార్య మిచెల్ ఒమాబా ఏది చేసినా సంచలనమే. ఒబామా అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కూడా తానొక సాధారణ పౌరునిగా వ్యవహరిస్తూ అందరినీ ఆశ్చర్య పర్చటమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అభిమానాన్ని చూరగొన్నాడు. భర్తకు తగ్గ భార్యగా మిచెల్ కూడా అందరి అభిమానాన్ని, ప్రేమను పొందారు. ఒబామా.. తనెప్పుడూ అధికార దర్పాన్ని ప్రదర్శించలేదు. ఓ సాధారణ మనిషిగా దైనందిన జీవితంలో వ్యవహరించాడు. ఎక్కడికెళ్లినా తన పర్యటనల ఫోటోలు, తీసుకున్న […]

విధాత: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, అతని భార్య మిచెల్ ఒమాబా ఏది చేసినా సంచలనమే. ఒబామా అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కూడా తానొక సాధారణ పౌరునిగా వ్యవహరిస్తూ అందరినీ ఆశ్చర్య పర్చటమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అభిమానాన్ని చూరగొన్నాడు. భర్తకు తగ్గ భార్యగా మిచెల్ కూడా అందరి అభిమానాన్ని, ప్రేమను పొందారు.
ఒబామా.. తనెప్పుడూ అధికార దర్పాన్ని ప్రదర్శించలేదు. ఓ సాధారణ మనిషిగా దైనందిన జీవితంలో వ్యవహరించాడు. ఎక్కడికెళ్లినా తన పర్యటనల ఫోటోలు, తీసుకున్న సెల్ఫీలు సోషల్ మీడియాలో పెట్టి అందరికీ అందుబాటులో ఉన్నాడు.
అధికార పర్యటనల్లోనూ, వ్యక్తిగతమైన విషయాల్లోనూ ఎన్నడూ పెద్ద పోకడలకు పోలేదు. ఎల్లవేళలా అంతటా సామాన్యుడిలా ఉన్నాడు, జీవించాడు. ఈ మధ్యనే అక్టోబర్‌లో 30వ హనీమూన్ టూర్‌కు బయలుదేరిన ఒబామా దంపతులు తమవైన అనుభవాలను పంచుకున్నారు.
ముప్పై ఏండ్ల కిందట మొదటి సారి హనిమూన్ వెళ్లినప్పుడు తాను ఒంటరిగా ఫీల్ అయ్యానని మిచెల్ తన జ్ఞాపకాలను నెమరు వేసుకొన్నారు. కానీ ఇప్పుడు 30వ హనీమూన్ సందర్భంగా.. టూర్ వెళ్లామనీ.. కానీ దూరంగా ఉండి మా రక్షణ బాధ్యతలు చూస్తున్న సీక్రెట్ ఏజెంట్ల మధ్య ఇరుకుగా అనిపించిందని చెప్పు కొచ్చారు మిచెల్. అయితే.. తమ చిలిపి చేష్టలను చూసి తట్టుకోలేక సీక్రెట్ ఏజెంట్లే పరారయ్యరని కొంటె కోనంగి చేష్టలను సమర్థించుకొన్నారు మిచెల్.