Odisha Train Accident | ఒడిశా ప్రమాద స్థలంలో ట్రాక్‌ పునరుద్ధరణ.. మొదలైన రాకపోకలు..!

Odisha Train Accident | ఒడిశా బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దేశ చరిత్రలో పెద్ద ప్రమాదంగా నిలిచింది. బహనాగ్‌ బజార్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో యశ్వంత్‌పూర్‌, కోరమండల్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు గూడ్స్‌రైలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 288 మంది మృత్యువాతపడగా.. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఓ వైపు సంఘటనా స్థలంలో వందలాది మంది కార్మికులు పునరుద్ధరణ పనులను కొనసాగిస్తున్నారు. Down-line restoration complete. First train […]

Odisha Train Accident | ఒడిశా ప్రమాద స్థలంలో ట్రాక్‌ పునరుద్ధరణ.. మొదలైన రాకపోకలు..!

Odisha Train Accident | ఒడిశా బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దేశ చరిత్రలో పెద్ద ప్రమాదంగా నిలిచింది. బహనాగ్‌ బజార్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో యశ్వంత్‌పూర్‌, కోరమండల్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు గూడ్స్‌రైలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 288 మంది మృత్యువాతపడగా.. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఓ వైపు సంఘటనా స్థలంలో వందలాది మంది కార్మికులు పునరుద్ధరణ పనులను కొనసాగిస్తున్నారు.

ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత మళ్లీ ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆదివారం రాత్రి 10.40 గంటలకు పునరుద్ధరించిన మార్గంలో తొలి గూడ్స్‌ రైలు ప్రయాణించింది. రైలు విశాఖ ఓడరేవు నుంచి రూర్కెలా ఉక్కు కర్మాగారానికి బొగ్గు తరలిస్తున్నది. రైలు వెళ్లే సమయంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సంఘటనా స్థలంలోనే ఉండి పరిశీలించారు. మరికొన్ని రైళ్లను ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాత రెండు రోజుల్లోనే మళ్లీ యథావిధిగా రైళ్ల రాకపోకలను ప్రారంభిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా వేగంగా ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేపట్టిన సిబ్బందిని ఆయన అభినందించారు.