బంగారు నగల కోసం.. కాళ్లు, చేతులు కట్టేసి వృద్ధురాలి దారుణ హత్య

విధాత,మెదక్ బ్యూరో: వృద్ధురాలికి మాయమాటలు చెప్పి నమ్మించి పిలిచి ఆమె వంటిపై ఉన్న బంగారం కళ్ళ కడియాలు కాజేయాలని పన్నాగం పన్నాడు ఓ దుర్మార్గుడు.. ఆమె ఎదురుతిరగడంతో కాళ్ళు, చేతులు కట్టేసి రాడ్డుతో కొట్టి దారుణంగా చంపిన విషాద ఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపెట్ మండలం చందంపేటలో శనివారం జరిగింది. పోలీసులు గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చందంపేట గ్రామానికి చెందిన వడియారం ఎల్లమ్మ (80) వృద్ధురాలు మెడలో ఉన్నబంగారం, కాళ్ళ కడియాలు దొంగలించాలని […]

  • By: krs    latest    Jan 28, 2023 12:53 PM IST
బంగారు నగల కోసం.. కాళ్లు, చేతులు కట్టేసి వృద్ధురాలి దారుణ హత్య

విధాత,మెదక్ బ్యూరో: వృద్ధురాలికి మాయమాటలు చెప్పి నమ్మించి పిలిచి ఆమె వంటిపై ఉన్న బంగారం కళ్ళ కడియాలు కాజేయాలని పన్నాగం పన్నాడు ఓ దుర్మార్గుడు.. ఆమె ఎదురుతిరగడంతో కాళ్ళు, చేతులు కట్టేసి రాడ్డుతో కొట్టి దారుణంగా చంపిన విషాద ఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపెట్ మండలం చందంపేటలో శనివారం జరిగింది.

పోలీసులు గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చందంపేట గ్రామానికి చెందిన వడియారం ఎల్లమ్మ (80) వృద్ధురాలు మెడలో ఉన్నబంగారం, కాళ్ళ కడియాలు దొంగలించాలని అదే గ్రామానికి చెందిన మ్యాకల యాదగిరి పథకం రచించాడు.

ఎల్లమ్మను ఇంట్లో ఎవరూ లేని సమయంలో యాదగిరి ఆమె వద్దకు వెళ్లి మాయమాటలు చెప్పి బంగారం దొంగలించే ప్రయత్నం చేశాడు. వృద్ధురాలు ప్రతిగటించడంతో కాళ్ళు, చేతులు కట్టేసి ఎల్లమ్మను రాడ్డుతో తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో రామాయంపేట సీఐ చంద్ర శేఖర్ రెడ్డి, ఎస్ ఐ సుభాష్ గౌడ్, ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు యాదగిరి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మృతురాలు ఎల్లమ్మకు 7 గురు సంతానం కాగా ఇద్దరు కుమారులు గ్రామంలోనే ఉంటున్నారు.