Revanth Reddy | సెప్టెంబర్ 17న.. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో: రేవంత్ రెడ్డి
Revanth Reddy | ధరణిని బరాబర్ రద్దు చేస్తాం పోరాడితేనే రాజకీయ భవిష్యత్తు డబుల్ ఇంజనంటే ప్రధాని, ఆధాని త్వరలోనే సాదారణ ఎన్నికలు కాంగ్రెస్ గెలుపుకు శ్రమించండి యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ.. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విధాత, హైదరాబాద్ ప్రతినిధి: 2023 సెప్టెంబర్ 17వ తేదీన కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు సబంధించి పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నాన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల […]

Revanth Reddy |
- ధరణిని బరాబర్ రద్దు చేస్తాం
- పోరాడితేనే రాజకీయ భవిష్యత్తు
- డబుల్ ఇంజనంటే ప్రధాని, ఆధాని
- త్వరలోనే సాదారణ ఎన్నికలు
- కాంగ్రెస్ గెలుపుకు శ్రమించండి
- యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ..
- సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
విధాత, హైదరాబాద్ ప్రతినిధి: 2023 సెప్టెంబర్ 17వ తేదీన కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు సబంధించి పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నాన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలపై పోరాడితేనే యూత్ కాంగ్రెస్ నాయకులకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్నారు.
రాజకీయ నాయకుడిగా మారెందుకు యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదిక అన్నారు. సోమాజిగూడ కత్రియా హోటల్‌లో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, ఇతర ముఖ్య నాయకులతో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1200 మంది విద్యార్థులు, యువత తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలతో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందన్నారు. డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధాని మాత్రమే అని ఎద్దేవ చేసిన ఆయన దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్ ఇంజన్ పని అన్నారు. వన్ నేషన్ వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా అని, బీజేపీ కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలోనే ఎన్నికలు రానున్నాయని, సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రమించాలన్నారు. తెలంగాణలో కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. డిసెంబర్ 9 న సోనియా జన్మదినం ఉందని, తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించి సోనియా గాంధికి కానుకగా ఇద్దామన్నారు. అలాగే 2024లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు యువజన కాంగ్రెస్ నాయకులు సైనికులుగా పని చేయాలన్నారు.
రాబోవు ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ క్రియాశీలక పాత్రపై సమావేశంలో ప్రధానంగా చర్చించి ఇందుకు అవసరమైన కార్యాచరణపై నాయకులకు దిశా నిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో కొట్లాడేవారే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులు అవుతారన్నారు. యువత కష్టపడితే నాయకులు కావడంతో పాటు దేశ భవిష్యత్తును మార్చుతారన్నారు. మోదీ, కేసీఆర్ లను గద్దె దించాలంటే యూత్ కాంగ్రెస్ మరింత క్రియాశీకలకంగా పని చేయాలన్నారు.
గడీల పాలన పునరుద్ధరించడానికే కేసీఆర్ ధరణి తీసుకొచ్చారని, ధరణిని బరాబర్ రద్దు చేస్తామన్నారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజ్ గిరి జిల్లాల్లో భూ అవకతవకలు జరిగాయాన్నారు. వేల ఎకరాలు కేసీఆర్ బినామీలకు కట్టబెట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భూములపై అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ అధికారుల దగ్గర ఉండాల్సిన సమాచారం దళారుల చేతికి వెళ్లిందని, ధరణి పోర్టల్ ప్రభుత్వ ఆధీనంలో లేదన్నారు.
ధరణి పోర్టల్ ప్రారంభించిన ఊరిలో భూముల రికార్డులు లేవన్నారు. ఏడ్చి, గోల పెట్టినా… తండ్రి కొడుకులను చర్లపల్లి జైలుకు పంపిస్తాం అని కేసీఆర్, కేటీఆర్‌లను ఉద్దేశించి అన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్న ఆయన, విద్య, ఉపాధి, సంక్షేమం ఇలా దేనిపైన అయినా చర్చకు తాను సిద్దంమని, కేటీఆర్, హరీష్ రావు చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.
అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడ్డారన్నారు. కేసీఆర్ రద్దైన వెయ్యి నోటు లాంటివారని, మోదీ 2వేల నోటు లాంటి వారన్నారు. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని రేవంత్ అభ్యర్థించారు. కర్ణాటక ఫలితాలు తెలంగాణలో పునరావృతం అవుతాయని, బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లతో ముందుకెళతాం అన్నారు.