Nipah virus | కేర‌ళ‌లో నిఫా క‌ల‌వ‌రం.. మ‌రొక‌రికి పాజిటివ్‌

Nipah virus ఆరుకు చేరిన నిఫా కేసులు ఇప్ప‌టికే ఇద్ద‌రు మృతి యాక్టివ్ కేసులు నాలుగు కేర‌ళ‌కు ప్ర‌యాణాలు వ‌ద్దు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఆదేశాలు విధాత‌: కేర‌ళ‌లో నిఫా వైర‌స్ విజృంభిస్తున్న‌ది. కోజికోడ్ జిల్లాలో శుక్ర‌వారం మ‌రొక‌రికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఇప్ప‌టికే ఈ జిల్లాలో నిఫాతో ఇద్ద‌రు చ‌నిపోయాగా, యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. నిఫా వైర‌స్ వ్యాపిని అరిక‌ట్టేందుకు అవ‌స‌ర‌మైతే త‌ప్ప కేర‌ళ‌కు ప్రయాణాలు చేయ‌వ‌ద్ద‌ని స‌రిహ‌ద్దు రాష్ట్రమైన క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను […]

  • By: Somu    latest    Sep 15, 2023 12:34 AM IST
Nipah virus | కేర‌ళ‌లో నిఫా క‌ల‌వ‌రం.. మ‌రొక‌రికి పాజిటివ్‌

Nipah virus

  • ఆరుకు చేరిన నిఫా కేసులు
  • ఇప్ప‌టికే ఇద్ద‌రు మృతి
  • యాక్టివ్ కేసులు నాలుగు
  • కేర‌ళ‌కు ప్ర‌యాణాలు వ‌ద్దు
  • క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఆదేశాలు

విధాత‌: కేర‌ళ‌లో నిఫా వైర‌స్ విజృంభిస్తున్న‌ది. కోజికోడ్ జిల్లాలో శుక్ర‌వారం మ‌రొక‌రికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఇప్ప‌టికే ఈ జిల్లాలో నిఫాతో ఇద్ద‌రు చ‌నిపోయాగా, యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. నిఫా వైర‌స్ వ్యాపిని అరిక‌ట్టేందుకు అవ‌స‌ర‌మైతే త‌ప్ప కేర‌ళ‌కు ప్రయాణాలు చేయ‌వ‌ద్ద‌ని స‌రిహ‌ద్దు రాష్ట్రమైన క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను కోరింది. కేర‌ళ స‌రిహ‌ద్దు జిల్లాలో చెక్‌పోస్టులు ఏర్పాటుచేయాల‌ని ఆదేశాలు జారీచేసింది.

కర్ణాటక నుంచి కేరళకు వెళ్లే మార్గాల్లో జ్వరం పర్యవేక్షణ కోసం చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని కర్ణాటక ఆరోగ్య శాఖ జిల్లా అధికారులకు సూచించింది. సరిహద్దు జిల్లాలైన చామరాజనగర్, మైసూర్, కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో జ్వరాలపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశాలు జారీచేసింది.

కోజికోడ్ జిల్లాలో శుక్ర‌వారం అన్ని ర‌కాల విద్యాసంస్థ‌ల‌ను మూసివేయాల‌ని ఆదేశాలిచ్చింది. నిఫా వైర‌స్ బారిన‌ప‌డిన వారితో స‌న్నిహితంగా మెలిగిన 15 మంది శాంపిళ్ల‌ను అధికారులు ప‌రీక్ష‌ల నిమిత్తం పంపించారు.

కోజికోడ్‌లో నిఫా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకున్న చర్యలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ICMR-NIV) నుంచి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ సమీక్షించారు.