Opposition Meeting in Patna | ఒకటే అజెండా.. బీజేపీ ఓటమి: పాట్నాలో విపక్ష పార్టీల నినాదం

Opposition Meeting in Patna | ప్రతిపక్ష ఐక్యతకు తొలి అడుగు 17 పార్టీల నేత సమావేశం సక్సెస్‌ అధికారం కాదు.. సిద్ధాంతాల కోసం దేశాన్ని కాపాడేందుకు ఏకమయ్యాం విభేదాలు వదిలి దేశం కోసం ఐక్యత ఉమ్మడి వ్యూహంపై సిమ్లాలో భేటీ వచ్చే నెలలో నిర్వహిస్తామన్న నేతలు ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ప్రణాళికలు అన్ని రాష్ట్రాల్లో బీజేపీని ఓడించాలి మీడియా సమావేశంలో విపక్ష నేతలు రాహుల్‌ పెళ్లి చేసుకోవాలన్న లాలూ మీరు చెప్పాక అయిపోతుందన్న రాహుల్‌ విధాత‌: […]

  • By: krs    latest    Jun 24, 2023 3:14 AM IST
Opposition Meeting in Patna | ఒకటే అజెండా.. బీజేపీ ఓటమి: పాట్నాలో విపక్ష పార్టీల నినాదం

Opposition Meeting in Patna |

  • ప్రతిపక్ష ఐక్యతకు తొలి అడుగు
  • 17 పార్టీల నేత సమావేశం సక్సెస్‌
  • అధికారం కాదు.. సిద్ధాంతాల కోసం
  • దేశాన్ని కాపాడేందుకు ఏకమయ్యాం
  • విభేదాలు వదిలి దేశం కోసం ఐక్యత
  • ఉమ్మడి వ్యూహంపై సిమ్లాలో భేటీ
  • వచ్చే నెలలో నిర్వహిస్తామన్న నేతలు
  • ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ప్రణాళికలు
  • అన్ని రాష్ట్రాల్లో బీజేపీని ఓడించాలి
  • మీడియా సమావేశంలో విపక్ష నేతలు
  • రాహుల్‌ పెళ్లి చేసుకోవాలన్న లాలూ
  • మీరు చెప్పాక అయిపోతుందన్న రాహుల్‌

విధాత‌: మోదీ పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యతకు గట్టి ముందడుగు పడింది. సమావేశంపై అనేక అపోహలు ఎదురైనా.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఐక్యంగా ఎదుర్కొనాలని బీజేపీయేతర 17 ప్రతిపక్ష పార్టీలు తీర్మానించాయి. శుక్రవారం పాట్నాలో ఏర్పాటు చేసిన ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌, బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్, వామపక్షాల నేతలు సీతారాం ఏచూరి, డీ రాజా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

పార్టీల మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి.. కలిసికట్టుగా కృషి చేయాలని, ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేసేందుకు వచ్చే నెలలో సిమ్లాలో మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు. దాదాపు నాలుగు గంటలపాటు కొనసాగిన భేటీ అనంతరం సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ మాట్లాడుతూ, ఐక్య పోరాటానికి తుది రూపు ఇచ్చేందుకు మరికొద్ది రోజుల్లో మరోసారి సమావేశం కానున్నట్టు తెలిపారు. ‘సమాశం చక్కగా సాగింది.

నాయకులు వారి వారి అభిప్రాయాలు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసేందుకు, పోటీ చేసేందుకు 17 పార్టీలు అంగీకారానికి వచ్చాయి’ అని తెలిపారు. తాము జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని నితీశ్‌ చెప్పారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీజేపీ పరిపాలన ఉన్నదని మండిపడ్డారు. ఆఖరుకు భారతదేశ చరిత్రను మార్చివేసేందుకు సైతం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. సమావేశంలో ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఢిల్లీపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్‌ తన వైఖరి చెప్పాలని పట్టుబట్టారని తెలిసింది. అయితే.. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేలు చొరవ చేసి.. సర్ది చెప్పారని సమాచారం. బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

తదుపరి సమావేశాన్ని సిమ్లాలో నిర్వహిస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఉమ్మడి అజెండాను తయారు చేసుకుని, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతామని చెప్పారు. బీజేపీని అన్ని రాష్ట్రాల్లోనూ ఓడించేందుకు ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉన్నదని ఖర్గే అన్నారు.

తమలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సాగుతామని, తమ సిద్ధాంతాలను కాపాడుకుంటామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చెప్పారు. బీహార్‌ ముఖ్యమంత్రి నివాసమైన అనేమార్గ్‌ 1లో జరిగిన సమావేశానికి 17 పార్టీలకు చెందిన 32 మంది నాయకులు హాజరయ్యారు.
పాట్నా నుంచి ఏది ప్రారంభించినా అది ప్రజా ఉద్యమరూపాన్ని సంతరించుకుంటుందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు.

అందుకే ప్రతిపక్షాల సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న నియంతృత్వ ప్రభుత్వం మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే.. ఇక భవిష్యత్తులో ఎన్నికలనేవే ఉండవోవని అన్నారు. ‘మేమంతా ఐక్యంగా ఉన్నాం. బీజేపీపై ఐక్యంగా పోరాడుతాం. చరిత్రను మార్చివేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. కానీ.. మేం చరిత్రను కాపాడితీరుతాం’ అని మమత చెప్పారు. తాము ప్రతిపక్ష పార్టీలు మాత్రమే కాదని, భారత మాతను ప్రేమించే దేశభక్త ప్రజలమని ఆమె అన్నారు.

జయప్రకాశ్‌ నారాయణ్‌ ఉద్యమంలాగా తమ ఐక్య కూటమి ప్రజల ఆశీస్సులు పొందుతుందన్న నమ్మకాన్ని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ వ్యక్తం చేశారు. ‘పాట్నా సమావేశం ఇస్తున్న సందేశంపై మా అందరికీ చాలా స్పష్టత ఉన్నది. దేశాన్ని కాపాడాలంటే మేమంతా ఐక్యంగా పనిచేయాలి’ అని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌ చెప్పారు. సమావేశాన్ని విజయవంతం చేసిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ రోజు పడిన ముందడుగు.. దేశానికి మైలు రాయి వంటిదని జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌ అన్నారు. నేతలందరం సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగుతామని తెలిపారు. బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని దేశ ప్రజలు తమను కోరుతున్నారని ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్‌ యాదవ్‌ చెప్పారు. ఒకవైపు దేశం సమస్యల్లో నిండి ఉంటే మోదీ అమెరికా వెళ్లి గంధపు చెక్కలు పంచుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

తాను ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, మోదీని ఎదుర్కొంటానని చెప్పారు. ప్రతిపక్షాలు ఐక్యంగా లేకపోవడం వల్ల ఓట్లు చీలిపోతున్నాయని ప్రజలు అంటున్నారని, అందుకే తాము ఐక్యంగా నిలిచామని చెప్పారు. బజరంగ్‌ బలి తమతో ఉన్నాడని, బీజేపీకి, నరేంద్రమోదీకి కష్టకాలం తప్పదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా లాలు సరదాగా చేసిన వ్యాఖ్య మీడియా సమావేశంలో నవ్వులు పూయించింది. ఇంకా సమయం ఉన్నదని, రాహుల్‌గాంధీ పెళ్లి చేసుకోవాలని లాలు అనగా.. ‘మీరు చెప్పారుగా.. అయిపోతుందిలెండి’ అంటూ రాహుల్‌ వెంటనే స్పందించారు.

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న 17 పార్టీలు.. అధికారం కోసం దగ్గరకు రాలేదని, సిద్ధాంతాల కోసం వచ్చాయని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా చెప్పారు. బీజేపీ ఈ దేశ లౌకిక, ప్రజాతంత్ర స్వభావాన్ని మార్చివేయాలని అనుకుంటున్నదని, అయితే.. ఆ స్వభావాన్ని కాపాడుకోవడమే ప్రధాన అంశమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. బీజేపీ తొమ్మిదేళ్ల పాలన విధ్వంసకరంగా సాగిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా విమర్శించారు. గాంధీ దేశాన్ని గాడ్సేల దేశంగా మారేందుకు అవకాశం ఇవ్వబోమని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ అన్నారు.

విధాత‌: మోదీ పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యతకు గట్టి ముందడుగు పడింది. సమావేశంపై అనేక అపోహలు ఎదురైనా.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఐక్యంగా ఎదుర్కొనాలని బీజేపీయేతర 17 ప్రతిపక్ష పార్టీలు తీర్మానించాయి. శుక్రవారం పాట్నాలో ఏర్పాటు చేసిన ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌, బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్, వామపక్షాల నేతలు సీతారాం ఏచూరి, డీ రాజా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీల మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి.. కలిసికట్టుగా కృషి చేయాలని, ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేసేందుకు వచ్చే నెలలో సిమ్లాలో మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు.

దాదాపు నాలుగు గంటలపాటు కొనసాగిన భేటీ అనంతరం సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ మాట్లాడుతూ, ఐక్య పోరాటానికి తుది రూపు ఇచ్చేందుకు మరికొద్ది రోజుల్లో మరోసారి సమావేశం కానున్నట్టు తెలిపారు. ‘సమాశం చక్కగా సాగింది. నాయకులు వారి వారి అభిప్రాయాలు వెల్లడించారు.

లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసేందుకు, పోటీ చేసేందుకు 17 పార్టీలు అంగీకారానికి వచ్చాయి’ అని తెలిపారు. తాము జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని నితీశ్‌ చెప్పారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీజేపీ పరిపాలన ఉన్నదని మండిపడ్డారు. ఆఖరుకు భారతదేశ చరిత్రను మార్చివేసేందుకు సైతం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. సమావేశంలో ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఢిల్లీపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్‌ తన వైఖరి చెప్పాలని పట్టుబట్టారని తెలిసింది. అయితే.. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేలు చొరవ చేసి.. సర్ది చెప్పారని సమాచారం. బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

తదుపరి సమావేశాన్ని సిమ్లాలో నిర్వహిస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఉమ్మడి అజెండాను తయారు చేసుకుని, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతామని చెప్పారు. బీజేపీని అన్ని రాష్ట్రాల్లోనూ ఓడించేందుకు ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉన్నదని ఖర్గే అన్నారు.

తమలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సాగుతామని, తమ సిద్ధాంతాలను కాపాడుకుంటామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చెప్పారు. బీహార్‌ ముఖ్యమంత్రి నివాసమైన అనేమార్గ్‌ 1లో జరిగిన సమావేశానికి 17 పార్టీలకు చెందిన 32 మంది నాయకులు హాజరయ్యారు.
పాట్నా నుంచి ఏది ప్రారంభించినా అది ప్రజా ఉద్యమరూపాన్ని సంతరించుకుంటుందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. అందుకే ప్రతిపక్షాల సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పారు.

ప్రస్తుతం కేంద్రంలో ఉన్న నియంతృత్వ ప్రభుత్వం మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే.. ఇక భవిష్యత్తులో ఎన్నికలనేవే ఉండవోవని అన్నారు. ‘మేమంతా ఐక్యంగా ఉన్నాం. బీజేపీపై ఐక్యంగా పోరాడుతాం. చరిత్రను మార్చివేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. కానీ.. మేం చరిత్రను కాపాడితీరుతాం’ అని మమత చెప్పారు. తాము ప్రతిపక్ష పార్టీలు మాత్రమే కాదని, భారత మాతను ప్రేమించే దేశభక్త ప్రజలమని ఆమె అన్నారు.