BJPని గద్దె దించడానికి విపక్షాలు కలిసి రావాలి: బీహార్ CM పిలుపు
ఉమ్మడిగా బరిలోకి దిగితేనే విజయం.. కాంగ్రెస్ నేతల నిర్ణయమే ప్రధానం.. సీపీఐ- ఎం 11వ సాధారణ సమావేశంలో నితీష్‌కుమార్ విధాత: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి దేశంలో ఉన్న అన్ని విపక్షపార్టీలు కలిసి రావాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్నారు. అది విజయవంమైతే బీజేపీని 100 స్థానాలకే పరిమితం చేయవచ్చు అని తెలిపారు. బీజేపీని 100 సీట్లకే పరిమితం చేయాలి… సీపీఐ- ఎం […]

- ఉమ్మడిగా బరిలోకి దిగితేనే విజయం..
- కాంగ్రెస్ నేతల నిర్ణయమే ప్రధానం..
- సీపీఐ- ఎం 11వ సాధారణ సమావేశంలో నితీష్‌కుమార్
విధాత: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి దేశంలో ఉన్న అన్ని విపక్షపార్టీలు కలిసి రావాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్నారు. అది విజయవంమైతే బీజేపీని 100 స్థానాలకే పరిమితం చేయవచ్చు అని తెలిపారు.
బీజేపీని 100 సీట్లకే పరిమితం చేయాలి…
సీపీఐ- ఎం 11వ సాధారణ సమావేశాలకు నితీష్ హాజరయ్యారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు వీలైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలి. నా సూచనలు సలహాలు పాటించి ఉమ్మడిగా బరిలోకి దిగితే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని 100 సీట్లకే పరిమితం చేయవచ్చు. లేకపోతే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
చివరి వరకు ప్రజల పక్షాన…
దేశ ప్రజలందరినీ ఏకతాటి మీదికి తీసుకురావడం, విద్వేషాలు వ్యాప్తి చేసే వ్యక్తుల నుంచి దేశాన్ని విముక్తి చేయడమే తన ఏకైక ఆశయమని నితీశ్ చెప్పారు. అంతకు మించి తాను కోరుకునేది ఏమీ లేదని, చివరిదాకా ప్రజల పక్షాన పోరాడుతానని అన్నారు.