ఇమ్రాన్ ఖాన్ సెక్స్ ఆడియో టేపులు బహిర్గతం! చిక్కుల్లో పాక్ మాజీ ప్రధాని!

విధాత‌: పాకిస్తాన్ నేతలు భలేగా చిక్కుల్లో ఇరుక్కుంటారు. వాళ్ళను పాక్ సైన్యం, ఐ ఎస్ ఐ పదవీచ్యుతులను చేయడం లేదా అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం. లేదా దేశం విడిచి పారిపోవడం వంటివి ఇన్నాళ్లూ చూశాం. కానీ ఇప్పుడు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏకంగా సెక్స్ స్కాములో ఇరుక్కున్నారు. ఓ మహిళతో ఆయన సరస సంభాషణ.. రెండు భాగాల ఆడియో క్లిప్‌ను పాకిస్థాన్ జర్నలిస్ట్ సయ్యద్ అలీ హైదర్ తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేశారు. ఈ […]

ఇమ్రాన్ ఖాన్ సెక్స్ ఆడియో టేపులు బహిర్గతం! చిక్కుల్లో పాక్ మాజీ ప్రధాని!

విధాత‌: పాకిస్తాన్ నేతలు భలేగా చిక్కుల్లో ఇరుక్కుంటారు. వాళ్ళను పాక్ సైన్యం, ఐ ఎస్ ఐ పదవీచ్యుతులను చేయడం లేదా అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం. లేదా దేశం విడిచి పారిపోవడం వంటివి ఇన్నాళ్లూ చూశాం. కానీ ఇప్పుడు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏకంగా సెక్స్ స్కాములో ఇరుక్కున్నారు.

ఓ మహిళతో ఆయన సరస సంభాషణ..

రెండు భాగాల ఆడియో క్లిప్‌ను పాకిస్థాన్ జర్నలిస్ట్ సయ్యద్ అలీ హైదర్ తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేశారు. ఈ ఆడియో క్లిప్ ఇమ్రాన్ ఖాన్‌ను ఈ సంవత్సరం ప్రారంభంలో అధికారం నుండి తొలగించినప్పటి నుండి వెంటాడుతోంది. ఇమ్రాన్ పై రోజుకొక ఆడియో, వీడియో రిలీజ్ చేస్తూ అతడిని ప్రజల్లో డ్యామేజ్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇమ్రాన్ పై కుట్ర పన్నుతున్న ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం సైనిక పాలనను నిందించినప్పటి నుండి అతనిని టార్గెట్ చేస్తూ లీక్ లు కొనసాగిస్తోంది.

కొన్ని పాకిస్తానీ న్యూస్ పోర్టల్స్ మాత్రం

ఈ క్లిప్స్ ఆడియో పాకిస్థాన్ పీఎంఓ (ప్రధాని కార్యాలయం) నుంచి వచ్చాయని చెబుతున్నాయి. ఆడియో యొక్క ప్రామాణికత ఇంకా సందేహాస్పదంగా ఉండగా కొంతమంది పాకిస్తానీ జర్నలిస్టులు ఆడియో ఇమ్రాన్ ఖాన్ దేనని అంటున్నారు. ఫేస్బుక్ వీడియోలో జర్నలిస్ట్ మన్సూర్ అలీ ఖాన్ లీక్ అయిన ఆడియోలోని అనామక మహిళ గురించి తనకు తెలుసని అన్నారు. పాక్ జర్నలిస్ట్ నైలా ఇనాయత్ మాట్లాడుతూ “సెక్స్ కాల్ లీక్లో ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ హష్మీగా మారాడు” అని ఎద్దేవా చేశారు.