గరం సమోసా, ఛాయ్.. ఆపై పాన్.. పాలకుర్తి సెంటర్లో మంత్రులు, ఎంపీ సందడి
విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: ఉల్లి సమోసాలు తిన్నారు. గరం గరం స్పెషల్ చాయ్ తాగారు. ఆ పైన పాన్ వేసుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి సెంటర్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత కాసేపు హడావుడి చేశారు. సాధారణంగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటే అక్కడ పార్టీ నాయకులు,కేడర్, జనాలు, అభిమానులు అక్కడ వెంటనే పోగయితారూ. అందులో కలుపుగోలుగా ఉండే ఎరబెల్లి లాంటి వారుంటే ఇది […]

విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: ఉల్లి సమోసాలు తిన్నారు. గరం గరం స్పెషల్ చాయ్ తాగారు. ఆ పైన పాన్ వేసుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి సెంటర్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత కాసేపు హడావుడి చేశారు.
సాధారణంగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటే అక్కడ పార్టీ నాయకులు,కేడర్, జనాలు, అభిమానులు అక్కడ వెంటనే పోగయితారూ. అందులో కలుపుగోలుగా ఉండే ఎరబెల్లి లాంటి వారుంటే ఇది ఎక్కువగా ఉంటుంది. అందులో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి సెంటర్ కావడంతో సోమవారం సహజంగానే భారీగా జనం పోగయ్యారు.
ఈనెల 12వ తేదీన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సీఎం కేసీఆర్ ప్రారంభం చేయనున్న సందర్భంగా హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్లే మార్గంలో పాలకుర్తికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత పాలకుర్తి సెంటర్లో కొద్దిసేపు ఆగారు.
మంత్రిని చూసి కాన్వాయ్ ఆపడంతో వారిని పక్కనే ఉన్న హొటల్ లోకీ ఆహ్వానించారు స్థానికులు. వెంటనే మంత్రులు, ఎంపీ హోటల్ కి వెళ్లి సమోసా తిని, గరం చాయ్ తాగి మంత్రులిద్దరూ పాన్ వేసుకుని కొద్దిసేపు హడావుడి చేస్తూ అందరిని ఆకర్షించారు. అనంతరం టీ సెంటర్ వద్ద స్థానికులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.