కరీంనగర్ కలెక్టర్ గా పమేలా సత్పతి, సీపీగా అభిషేక్ మహంతి

కరీంనగర్ కలెక్టర్ గా పమేలా సత్పతి, సీపీగా అభిషేక్ మహంతి

– సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు

విధాత: కరీంనగర్ కొత్త కలెక్టర్ గా పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గా అభిషేక్ మహంతి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులిచ్చారు. పమేలా సత్పతి ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా ఉన్నారు. అభిషేక్ మహంతి రాచకొండ ట్రాఫిక్ డీసీపీగా కొనసాగుతున్నారు. తాజాగా వారిని కేంద్ర ఎన్నికల సంఘం సిఫారసు మేరకు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.