Odisha | ఒడిశాలో మ‌రో రైలు ప్ర‌మాదం.. పూరి ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు

Odisha | ఒడిశాను రైలు ప్ర‌మాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొన్న కోర‌మండ‌ల్ ఎక్స్‌ప్రెస్ ప్ర‌మాదం, నిన్న గూడ్స్ రైలు ప్ర‌మాదం.. తాజాగా పూరి ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు చెల‌రేగాయి. వివ‌రాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని నౌపాడా జిల్లాలోని ఖ‌రియార్ రోడ్ స్టేష‌న్‌లో ఆగి ఉన్న దుర్గ్ - పూరి ఎక్స్‌ప్రెస్‌లో పొగ‌లు వ‌చ్చాయి. బీ3 కోచ్‌లో పొగ‌లు రావ‌డాన్ని గ‌మ‌నించిన ప్ర‌యాణికులు కింద‌కు దిగారు. క్ష‌ణాల్లోనే మంట‌లు చెల‌రేగాయి. స్టేష‌న్‌లోనే రైలు ఆగి ఉండ‌టంతో.. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు మంట‌ల‌ను ఆర్పేశారు. […]

Odisha | ఒడిశాలో మ‌రో రైలు ప్ర‌మాదం.. పూరి ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు

Odisha | ఒడిశాను రైలు ప్ర‌మాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొన్న కోర‌మండ‌ల్ ఎక్స్‌ప్రెస్ ప్ర‌మాదం, నిన్న గూడ్స్ రైలు ప్ర‌మాదం.. తాజాగా పూరి ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు చెల‌రేగాయి.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని నౌపాడా జిల్లాలోని ఖ‌రియార్ రోడ్ స్టేష‌న్‌లో ఆగి ఉన్న దుర్గ్ – పూరి ఎక్స్‌ప్రెస్‌లో పొగ‌లు వ‌చ్చాయి. బీ3 కోచ్‌లో పొగ‌లు రావ‌డాన్ని గ‌మ‌నించిన ప్ర‌యాణికులు కింద‌కు దిగారు. క్ష‌ణాల్లోనే మంట‌లు చెల‌రేగాయి. స్టేష‌న్‌లోనే రైలు ఆగి ఉండ‌టంతో.. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు మంట‌ల‌ను ఆర్పేశారు.

ప్ర‌మాదంలో ఎవ‌రికీ గాయాలు కాలేదు. గంట‌లోపే రైలుకు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టారు. గురువారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో స్టేష‌న్ నుంచి రైలు బ‌య‌ల్దేరింది. అయితే బ్రేక్ ప్యాడ్‌లో లోపం త‌లెత్త‌డం వ‌ల్లే మంట‌లు చెల‌రేగిన‌ట్లు రైల్వే అధికారులు నిర్ధారించారు.

ఇటీవ‌ల జ‌రిగిన కోర‌మండ‌ల్ ఎక్స్‌ప్రెస్ ప్ర‌మాదంలో 288 మంది మృతి చెందిన విష‌యం తెలిసిందే. 1,100 మంది తీవ్రంగా గాయ‌ప‌డి ప‌లు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక రెండు రోజుల క్రితం భారీ ఈదురుగాలుల‌కు గూడ్స్ రైలు ముందుకు క‌ద‌ల‌డంతో బోగీలు ప‌క్క‌కు ఒరిగాయి. దీంతో బోగీల వ‌ద్ద ఉన్న‌ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.