Parineeti Chopra | ఘ‌నంగా ప‌రిణీతి చోప్రా నిశ్చితార్థం

చోప్రాకు రాహుల్ చ‌ద్దా స్వీట్‌ కిస్‌ సోష‌ల్‌మీడియాలో వైర‌లైన‌ ఫొటోలు విధాత‌: కొన్ని నెలల ఊహాగానాలు, పెళ్లి పుకార్ల‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ.. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా ఎట్టకేలకు ఎంగేజ్ అయ్యారు. హీరోయిన్ ప‌రిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా నిశ్చితార్థ వేడుక శ‌నివారం న్యూఢిల్లీలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ ఫంక్ష‌న్‌కు ప‌లువురు సినీ, రాజకీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. చాలా రోజులుగా వీరిద్ద‌రూ ప్రేమ‌లో […]

Parineeti Chopra | ఘ‌నంగా ప‌రిణీతి చోప్రా నిశ్చితార్థం
  • చోప్రాకు రాహుల్ చ‌ద్దా స్వీట్‌ కిస్‌
  • సోష‌ల్‌మీడియాలో వైర‌లైన‌ ఫొటోలు

విధాత‌: కొన్ని నెలల ఊహాగానాలు, పెళ్లి పుకార్ల‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ.. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా ఎట్టకేలకు ఎంగేజ్ అయ్యారు. హీరోయిన్ ప‌రిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా నిశ్చితార్థ వేడుక శ‌నివారం న్యూఢిల్లీలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ ఫంక్ష‌న్‌కు ప‌లువురు సినీ, రాజకీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. చాలా రోజులుగా వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌ని, ఎంగేజ్‌మెంట్ చేసుకుంటార‌ని, ఫ‌లానా నెల‌లో పెళ్లి చేసుకుంటారంటూ నెట్టింట వార్త‌లు గుప్పుమ‌న్నాయి.