నేడు సూర్యగ్రహణం.. ఈ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే..?

Solar Eclipse | దీపావళి పర్వదినం రోజున సూర్యగ్రహణం ఏర్పడనుంది. 27 ఏండ్ల తర్వాత ఏర్పడుతున్న ఈ పాక్షిక సూర్య గ్రహణం పలు రాశులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. సూర్యగ్రహణం ఎప్పుడూ ప్రత్యేకమైనదే.. కానీ కార్తీక మాసం అమావాస్య ముగిసిన తర్వాత ఏర్పడే ఈ గ్రహణం.. చాలా విశిష్టమైనదని పండితులు చెబుతున్నారు. అయితే ఈ రాశుల్లో పుట్టిన వ్యక్తులపై అనేక రకాలుగా ప్రభావం చూపనుందని హెచ్చరించారు. అలాంటి వారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని […]

  • Publish Date - October 24, 2022 / 05:45 AM IST

Solar Eclipse | దీపావళి పర్వదినం రోజున సూర్యగ్రహణం ఏర్పడనుంది. 27 ఏండ్ల తర్వాత ఏర్పడుతున్న ఈ పాక్షిక సూర్య గ్రహణం పలు రాశులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. సూర్యగ్రహణం ఎప్పుడూ ప్రత్యేకమైనదే.. కానీ కార్తీక మాసం అమావాస్య ముగిసిన తర్వాత ఏర్పడే ఈ గ్రహణం.. చాలా విశిష్టమైనదని పండితులు చెబుతున్నారు.

అయితే ఈ రాశుల్లో పుట్టిన వ్యక్తులపై అనేక రకాలుగా ప్రభావం చూపనుందని హెచ్చరించారు. అలాంటి వారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. భారత్ లో 25వ తేదీన సాయంత్రం 4.29 గంటలకు ప్రారంభమై.. 5.43 గంటలకు ముగుస్తుంది. అంటే ఒక గంట 14 నిమిషాల 15 సెకన్ల పాటు పాక్షిక సూర్యగ్రహణం కొనసాగనుంది.

ఈ మూడు రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే..

మేషం : 25న సంభవించబోయే సూర్యగ్రహణం మేష రాశివారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రాశుల వారి వివాహ జీవితంలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మేష రాశి వాళ్లు వీలైనంత వరకు ఆలోచనలను, మనస్సును అదుపులో ఉంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

మిథునం: ఈ రాశిలో పుట్టిన వాళ్లకి సూర్యగ్రహణం ప్రభావం కాస్త ప్రతికూలంగానే ఉంటుందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రాశి వారు తీవ్ర మానసిక సమస్యలకు, ఒత్తిడికి గురవుతారని చెబుతున్నారు. అందుకే గ్రహణం సమయంలో వీలైనంత వరకు అతిగా ఆలోచించడాన్ని అదుపు చేసుకోవడం అవసరమని సూచిస్తున్నారు.

కర్కాటకం: ఇక కర్కాటక రాశిలో పుట్టిన వారిపై కూడా గ్రహణం ప్రభావం తీవ్రంగానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వీరంతా చాలా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఈ విషయం వారికి కొంచెం బాధాకరంగానే ఉండొచ్చు. కానీ ఈ విషయాన్ని గ్రహించి అప్రమత్తంగానే ఉండడం మంచిది. ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.