ఇంతకూ పవన్ విశాఖ వస్తున్నట్టా.. రానట్టా?
విధాత: మోడీ కాసేపట్లో విశాఖ వస్తున్నారు.. పలు అంభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.. రాత్రికి విశాఖలోనే ఉంటారు.. రేపుదయం భారీ బహిరంగ సభలో మాట్లాడతారు. జగన్ కూడా తొలిసారిగా విశాఖలో నైట్ హాల్ట్ ఉంటారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఫ్రీవేటికరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. ఇదీ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన వార్తలు. అయితే వీటన్నింటికన్నా ఇంకో అంశం ప్రధానమై కూర్చుంది. అదే పవన్ కళ్యాణ్.. మోడీ సభకు ఆయన వస్తారా..రారా.. ఆయనకు పిలుపు ఉందా లేదా.. […]

విధాత: మోడీ కాసేపట్లో విశాఖ వస్తున్నారు.. పలు అంభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.. రాత్రికి విశాఖలోనే ఉంటారు.. రేపుదయం భారీ బహిరంగ సభలో మాట్లాడతారు. జగన్ కూడా తొలిసారిగా విశాఖలో నైట్ హాల్ట్ ఉంటారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఫ్రీవేటికరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. ఇదీ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన వార్తలు. అయితే వీటన్నింటికన్నా ఇంకో అంశం ప్రధానమై కూర్చుంది. అదే పవన్ కళ్యాణ్..
మోడీ సభకు ఆయన వస్తారా..రారా.. ఆయనకు పిలుపు ఉందా లేదా.. ఏమిటో ఎవరూ చెప్పలేక పోతున్నారు. ఇదిలా ఉండగా మోడీ పిలుపు మేరకు పవన్ ప్రత్యేక విమానంలో విశాఖకు ఈ నెల 11న వస్తున్నారని అంటున్నారు. విశాఖలో 11న రాత్రి బస చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన సాయంత్రం ఏడున్నరకు భేటీ అవుతారని ప్రచారం సాగుతోంది.
దీనికి సంబంధించి అటు జనసేన కానీ ఇటు బీజేపీ వర్గాలు ఇంకా ప్రధాని కార్యాలయం కూడా ఏమి క్లారిటీ ఇవ్వడం లేదు. బీజేపీ నాయకులు అయితే ప్రధాని మొత్తం టూర్, ఆయన అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ప్రధాని కార్యాలయం చూసుకుంటుందని.. ఇందులో తమ పాత్ర లేదని చెబుతున్నరు.
మోడీ తనకు బాగా క్లోజ్ అని పదేపదే చెప్పే పవన్ నిజంగానే ప్రధాని ఆఫీస్ నుంచి విశాఖలో ఆయన భేటీ కోసం ఏపాయింట్ మెంట్ సంపాదించారా అన్నది తెలీడం లేదు. అసలు పవన్ ఇప్పుడు బీజేపీతో కలిసి నడుస్తారా.. టీడీపీతో వెళ్తారా అన్నది ఈ దెబ్బతో తేలిపోతుందని అంటున్నారు.