Pawan Kalyan | పవన్ ఫిక్సయ్యారు.. జగన్‌కు ఇక ఆ మాట నో ఛాన్స్

Pawan Kalyan విధాత‌: పవన్ కళ్యాణ్ సీరియస్ నిర్ణయం తీసుకున్నారు. జగన్‌కు ఇక ఆ అవకాశం లేకుండా చేశారు.. ఇకముందు జగన్ ఈ విషయమై నోరెత్తలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇక జగన్ గమ్మున ఉండాల్సిందే. ఇంతకూ ఏమనుకున్నారా? పవన్ కళ్యాణ్ ఏకంగా మంగళగిరికి తన పార్టీ కార్యాలయాన్ని తరలించారు. హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలాయం నుంచి సిబ్బంది, ఫైల్స్, కంప్యూటర్లను అన్నీ మంగళగిరి పార్టీ ఆఫీసుకు తరలించిన పవన్ తాను సైతం ఇక్కడే ఉండేందుకు ఇల్లు కూడా […]

Pawan Kalyan | పవన్ ఫిక్సయ్యారు.. జగన్‌కు ఇక ఆ మాట నో ఛాన్స్

Pawan Kalyan

విధాత‌: పవన్ కళ్యాణ్ సీరియస్ నిర్ణయం తీసుకున్నారు. జగన్‌కు ఇక ఆ అవకాశం లేకుండా చేశారు.. ఇకముందు జగన్ ఈ విషయమై నోరెత్తలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇక జగన్ గమ్మున ఉండాల్సిందే. ఇంతకూ ఏమనుకున్నారా? పవన్ కళ్యాణ్ ఏకంగా మంగళగిరికి తన పార్టీ కార్యాలయాన్ని తరలించారు.

హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలాయం నుంచి సిబ్బంది, ఫైల్స్, కంప్యూటర్లను అన్నీ మంగళగిరి పార్టీ ఆఫీసుకు తరలించిన పవన్ తాను సైతం ఇక్కడే ఉండేందుకు ఇల్లు కూడా రెడీ చేసారని తెలుస్తోంది. ఇక ముందు అయన జగన్ మీద తీవ్ర స్థాయిలో పోరాటం చేసేందుకు వీలుగా స్థానికంగా ఉంటారని అంటున్నారు.

పవన్ హైద్రాబాదులో ఉంటారు.. చంద్రబాబు పిలిస్తే ఇక్కడికి వచ్చి రెండ్రోజులు షో చేసి వెళ్తారని ఇకముందు వైసిపి మంత్రులు ఎమ్మెల్యేలు ఆరోపించేందుకు వీలు లేకుండా ఇక తాను సైతం లోకల్ అవుతున్నారు.

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బాటు రెండు విడతలుగా వారాహి యాత్ర చేసి రాజకీయ కాక పుట్టించిన పవన్ ఇంకా ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంటుంది. దీంతో బాటు అభ్యర్థుల ఎంపిక, టీడీపీ లేదా బిజెపి వాళ్ళతో పొత్తు ఉంటే సీట్ల సర్దుబాటు వంటి చర్చలకు.. ఇంకా జిల్లాల్లోని నాయకులకు అందుబాటులో ఉండేందు కోసం ఇక్కడే ఉండాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఇక రానున్న రోజుల్లో పవన్ మంగళగిరిలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని క్యాడర్ అంటోంది.