పవన్ అలా.. నాగబాబు ఇలా! పొత్తులపై తలోమాట!!

విధాత: రానున్న ఎన్నికలకు సంబంధించి జనసేనలో అసలు చర్చ జరిగిందా.. జరుగుతోందా.. ఒక విధానం.. ఒక రూట్ మ్యాప్.. పథకం ఉన్నాయా.. ఏ సమాచారం అయినా నాయకుల మధ్య సర్క్యులేట్ అవుతోందా.. ఎవరు ఏం మాట్లాడాలో ఓ రూల్ ఉందా అనే సందేహం కలుగుతోంది. నేను ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి వీర మరణం పొందలేము.. పొత్తులు ఉండాలి.. ప్రతిపక్ష ఓటును చీలనివ్వను అని పవన్ చెబుతుండగా.. అవసరం అయితే సింగిల్ హ్యాండ్ తో రంగంలోకి దిగుతాం […]

  • By: krs    latest    Jan 22, 2023 1:35 PM IST
పవన్ అలా.. నాగబాబు ఇలా! పొత్తులపై తలోమాట!!

విధాత: రానున్న ఎన్నికలకు సంబంధించి జనసేనలో అసలు చర్చ జరిగిందా.. జరుగుతోందా.. ఒక విధానం.. ఒక రూట్ మ్యాప్.. పథకం ఉన్నాయా.. ఏ సమాచారం అయినా నాయకుల మధ్య సర్క్యులేట్ అవుతోందా.. ఎవరు ఏం మాట్లాడాలో ఓ రూల్ ఉందా అనే సందేహం కలుగుతోంది.

నేను ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి వీర మరణం పొందలేము.. పొత్తులు ఉండాలి.. ప్రతిపక్ష ఓటును చీలనివ్వను అని పవన్ చెబుతుండగా.. అవసరం అయితే సింగిల్ హ్యాండ్ తో రంగంలోకి దిగుతాం అని నాగబాబు అంటున్నారు.

కర్నూలులో జనసేన వీర మహిళలు, కార్యకర్తల సమావేశానికి హాజరైన నాగబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ఒక పార్టీయేనా.. అరాచకం.. దుర్మార్గం.. దౌర్జన్యం కలిస్తే వైసీపీ అంటూ నిప్పులు చెరిగారు.

వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఎవరితో అనేది పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని నాగబాబు తెలిపారు. పొత్తులు ఖరారు తరువాత ఎవరు ఎక్కడ పోటీ చేయాలో తెలుస్తుందని వివరించారు. వీరమహిళలు జన సైనికులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకోవడానికి కర్నూలు వచ్చానని చెప్పారు.

గ్రామ స్థాయి నుంచి జన సైనికులు బలంగా వున్నారన్న నాగబాబు.. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇన్ చార్జిలను నియమించాలని సూచించారు.