Pawan Kalyan | అటు వారాహి యాత్ర.. గ్యాప్‌లో పవన్‌ షూటింగ్స్

Pawan Kalyan ఇకమీదట ఆంధ్ర, తెలంగాణ పరిసరాల్లోనే షూటింగ్స్ విధాత‌: సినిమా నటులు షూట్ గ్యాప్ లో పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం.. మిత్రులతో ముచ్చట్లు వంటివి పెడుతూ ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం అదే పాలసీ ఫాలో అవుతున్నారు.. రేపటి నుంచి వారాహి యాత్ర ప్రారంభం కానుంది.. ఇది ఇక అలా మెల్లగా అన్ని జిల్లాల్లోనూ సాగుతుంది. మరి అన్ని నెలలు పాలిటిక్స్ లో ఉంటె ఆల్రెడీ ఒప్పుకున్న హరిహర వీరమల్లు వంటి సినిమాల పరిస్థితి […]

Pawan Kalyan | అటు వారాహి యాత్ర.. గ్యాప్‌లో పవన్‌ షూటింగ్స్

Pawan Kalyan

  • ఇకమీదట ఆంధ్ర, తెలంగాణ పరిసరాల్లోనే షూటింగ్స్

విధాత‌: సినిమా నటులు షూట్ గ్యాప్ లో పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం.. మిత్రులతో ముచ్చట్లు వంటివి పెడుతూ ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం అదే పాలసీ ఫాలో అవుతున్నారు.. రేపటి నుంచి వారాహి యాత్ర ప్రారంభం కానుంది.. ఇది ఇక అలా మెల్లగా అన్ని జిల్లాల్లోనూ సాగుతుంది.

మరి అన్ని నెలలు పాలిటిక్స్ లో ఉంటె ఆల్రెడీ ఒప్పుకున్న హరిహర వీరమల్లు వంటి సినిమాల పరిస్థితి ఏమిటి ? అందుకే నిర్మాతలు ఆయనకు వీలైన సమయంలోనే, వీలైన ప్రదేశాల్లోనే షూటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అటు పాలిటిక్స్ చేస్తూనే నిర్మాతలకు ముందుగా ఒప్పుకున్న మేరకు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు, సినిమా సంస్థలు ఆయనకు అనుకూలంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. ఇక ముందు ఫారిన్ వంటి దూర ప్రదేశాల్లో కాకుండా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలతో బాటు, ఏపీలోని వివిధ ప్రాంతాల్లో షూటింగ్స్‌ చేయాలని అనుకుంటున్నారు.

రాబోయే రోజుల్లో పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర నేపథ్యంలో ఎక్కువగా ఏపీలోనే ఉండబోతున్న నేపథ్యంలో మంగళగిరి, విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేస్తామని డీవీవీ దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్‌, ఏఎం రత్నం, బీవీఎస్‌ఎస్‌ ప్రసాద్‌తోపాటు డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ప్రకటించారు.

వారాహి షెడ్యూల్స్‌తో పవన్‌ కల్యాణ్‌ బిజీగా ఉండనుండటంతో.. హీరో డేట్స్‌ విషయంలో షూటింగ్స్ షెడ్యూల్స్‌కు ఇబ్బంది కలగకుండా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పవన్‌ కల్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu), హరీష్‌ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ (Ustaad Bhagat Singh) చిత్రాల్లో నటిస్తున్నారు.