పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసే స్థానంపై క్లారిటీ.. అక్క‌డి నుంచే

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు

పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసే స్థానంపై క్లారిటీ.. అక్క‌డి నుంచే

విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు. తనకు ఎంపీగా పోటీ చేయడం పట్ల ఆసక్తి లేదన్నారు. గత ఎన్నికల్లో బీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో ఈ దఫా తన నియోజకవర్గాన్ని పవన్‌ మార్చుకున్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలనుద్ధేశించి మాట్లాడారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ అదే సమయంలో ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తానా లేదా అనేది పెద్దలు నిర్ణయిస్తారని చెప్పారు. వ్యక్తిగతంగా నాకు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని ఆసక్తి ఉందని స్పష్టం చేశారు. రాజకీయాల్లో తగ్గే కొద్ది ఎదుగుతామని, జనసేన కార్యకర్తలు సీట్లు, పొత్తులపై నిరాశ చెందవద్దని, భవిష్యత్తు మనదేనని ఉత్సాహా పరిచారు.