పాటలు, ఫైట్లు లేకుండా పవన్ కల్యాణ్‌ ‘OG’, ఆపై రెండు భాగాలుగా..!

విధాత‌, సినిమా: తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాతగా ఈ చిత్రం ప్రారంభమైంది. దీనికి ఓజీ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టారు ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్ట‌ర్. ఇక ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొంద‌నుంద‌ని సమాచారం. ఈ సినిమాలో పాటలు, ఫైట్లు ఉండవట. అయినా ఇది ఒక గ్యాంగ్ స్ట‌ర్ చిత్రం కావడం విశేషం. మొదటి భాగాన్ని అక్టోబర్ 23న […]

  • By: Somu    latest    Feb 03, 2023 10:30 AM IST
పాటలు, ఫైట్లు లేకుండా పవన్ కల్యాణ్‌ ‘OG’, ఆపై రెండు భాగాలుగా..!

విధాత‌, సినిమా: తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాతగా ఈ చిత్రం ప్రారంభమైంది. దీనికి ఓజీ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టారు ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్ట‌ర్. ఇక ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొంద‌నుంద‌ని సమాచారం. ఈ సినిమాలో పాటలు, ఫైట్లు ఉండవట. అయినా ఇది ఒక గ్యాంగ్ స్ట‌ర్ చిత్రం కావడం విశేషం.

మొదటి భాగాన్ని అక్టోబర్ 23న దసరా కానుకగా విడుదల చేస్తారని ప్రచారం సాగుతోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో అల్లు అరవింద్ కూడా భాగస్వామి అని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఆయన వెనుక నుంచి సైలెంట్ గా ఫైనాన్స్ చేస్తున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని అల్లు స్టూడియోస్ లో చిత్రీక‌రించ‌నున్నార‌ట‌.

ఇక ఈ సినిమా రిలీజ్కు సంబంధించిన పనులు కూడా అల్లు అరవింద్ స్వయంగా చూసుకోబోతున్నారని అంటున్నారు. ఈ చిత్రంలోని ప్రతి విషయంలోనూ అల్లు అరవింద్ హస్తం ఉందని టాలీవుడ్ మీడియా అంటుంది. అందులో నిజం ఏంటో తెలియదు గానీ ప్రస్తుత మాత్రం ఈ ప్రచారం ఊపందుకొంది.

సాహో తర్వాత దాదాపు నాలుగేండ్ల విరామం తీసుకుని సుజిత్ ఈ కథను సిద్ధం చేశారు. పైగా అతను పవన్‌కు వీరాభిమాని కావడంతో ఈ సినిమా ఏ లెవెల్‌లో ఉంటుందా అని అభిమానులు అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇందులో అల్లు అర‌వింద్ భాగ‌స్వామి కావ‌డంతోనే ప‌వ‌న్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్, వినోదాయ‌సిత్తం రీమేకులను కాద‌ని ముందుగా ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాడ‌ని అంటున్నారు. అయితే పవన్ చిత్రంలో పాటలు ఫైట్స్ లేకుండా ఉంటే వాటిని ప్రేక్షకులు, అభిమానులు ఏ విధంగా స్వీకరిస్తారు? అనేది పలు అనుమానాలకు తావిస్తోంది. మరి మొత్తానికి సుజిత్ పవన్‌తో ఎలాంటి చిత్రం చేయనున్నాడు అనేది OGతో తేలిపోనుంది.

ఈ సినిమాకి పంజా, సాహో చిత్రాల లాగా కాకుండా కేజీఎఫ్, పఠాన్ లాంటి ఫలితం దక్కాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తీయబోతున్నట్టు తెలుస్తోంది తొలి భాగాన్ని దసరాకు విడుదల చేయనున్నారు ఈ చిత్రానికి క్లైమాక్స్ హైలైట్ అంటున్నారు. ఇంత వ‌ర‌కు ఎవ్వ‌రు చూడ‌ని రీతిలో ఈ చిత్రం క్లైమాక్స్ టెర్రిఫిక్ గా ఉంటుంద‌ని స‌మాచారం.