ఉద్యోగాల పేరుతో మోసం.. నిందితుడిపై PDయాక్ట్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పిస్తానని యువతీ, యువకులను మోసం చేస్తున్న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అమ్మపాలెం చెందిన డాకురి భిక్షంపై వరంగల్ పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను వర్ధన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గడ్డం సదన్ కుమార్ ఖమ్మం జైలులో సోమవారం నిందితుడికి అందజేశారు. అనంతరం నిందితుడిని చర్లపల్లి జైలుకి తరలించారు. పీడీ యాక్ట్ అందుకున్న నిందితుడు మరికొందరు నిందితులతో […]

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పిస్తానని యువతీ, యువకులను మోసం చేస్తున్న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అమ్మపాలెం చెందిన డాకురి భిక్షంపై వరంగల్ పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వులను వర్ధన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గడ్డం సదన్ కుమార్ ఖమ్మం జైలులో సోమవారం నిందితుడికి అందజేశారు. అనంతరం నిందితుడిని చర్లపల్లి జైలుకి తరలించారు.
పీడీ యాక్ట్ అందుకున్న నిందితుడు మరికొందరు నిందితులతో కలిసి ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పిస్తానని చదువుకున్న నిరుద్యోగ యవతను మోసం చేసి వారి నుంచి లక్షల్లో డబ్బు వసూళ్ళకు పాల్పడ్డారు. ఈ సంఘటనలో నిందితుడుని గతంలో వర్ధన్నపేట పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
తాజాగా పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రంగనాథ్ మాట్లాడూతూ చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడే వ్యకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిపై పీడీయాక్ట్ క్రింద కేసులు నమోదు చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.