ఎందుకొచ్చిన దిక్కుమాలిన పదవి.. రోడ్డుకూ గతిలేదు!: కోటంరెడ్డి రోద‌న‌

విధాత‌: మంత్రి హామీ.. అధికారిక ఎప్రూవల్, సీఎం కార్యాలయంలో అనుమతులు ఉన్నాసరే ఓ చిన్న రోడ్డుకు నిధులు మంజూరు చేయించుకోలేని దుస్థితి. ఈ పదవి కోసమేనా ఇన్నాళ్లు.. ఇన్నేళ్లు ఎదురు చూసాను. ఎందుకొచ్చిన పదవి.. ఎవరికోసం అంటూ ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బావురుమన్నారు. గతంలోనూ ఆయన పలు సందర్భాల్లో ఇలాగే మురుగు కాలువలో దిగి మరీ నిరసన వ్యక్తం చేశారు. ఇది ఈయన ఒక్కడి పరిస్థితి కాదు… రాష్ట్రంలో దాదాపు ఎమ్మెల్యేలందరిది […]

ఎందుకొచ్చిన దిక్కుమాలిన పదవి.. రోడ్డుకూ గతిలేదు!: కోటంరెడ్డి రోద‌న‌

విధాత‌: మంత్రి హామీ.. అధికారిక ఎప్రూవల్, సీఎం కార్యాలయంలో అనుమతులు ఉన్నాసరే ఓ చిన్న రోడ్డుకు నిధులు మంజూరు చేయించుకోలేని దుస్థితి. ఈ పదవి కోసమేనా ఇన్నాళ్లు.. ఇన్నేళ్లు ఎదురు చూసాను. ఎందుకొచ్చిన పదవి.. ఎవరికోసం అంటూ ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బావురుమన్నారు.

గతంలోనూ ఆయన పలు సందర్భాల్లో ఇలాగే మురుగు కాలువలో దిగి మరీ నిరసన వ్యక్తం చేశారు. ఇది ఈయన ఒక్కడి పరిస్థితి కాదు… రాష్ట్రంలో దాదాపు ఎమ్మెల్యేలందరిది ఇదే దుస్థితి.. సర్పంచులు.. ఎంపిపిలకు కనీసం పనులు చేయలేని .. కేవలం ప్రోటోకాల్ కోసం ఎమ్మేల్యేలుగా ఉంటున్నారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి మరోసారి ఆగ్రహం వచ్చింది. అది అధిష్టానంపై కోపమే అయినా.. ఆయన నేరుగా అధిష్టానంపై చూపించలేక అధికారుల పై చూపించారనే టాక్ వినిపిస్తోంది. నెల్లూరు జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో అధికారుల తీరుపై శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కలెక్టర్ చక్రధర్ బాబు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

నాలుగేళ్లగా తన నియోజకవర్గంలో పనులేమీ జరగడం లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మంజూరు చేసిన పనులకు సైతం అధికారులు ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వడం లేదన్నారు.

బారాషాహీద్ దర్గాలో రూ.15 కోట్ల నిధులతో ముఖ్యమంత్రి అభివృద్ధి పనులు మంజూరు చేస్తే ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వలేదని తెలిపారు. బీసీ భవన్ అంబేద్కర్ భవన్ మైనార్టీ గురుకుల పాఠశాల పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నిధులు లేవని అభివృద్ధి పనులు ఆపేసిన అధికారులు కోటి రూపాయల వ్యయంతో నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నివాసం నిర్మించడం ఏమిటని ప్రశ్నించారు.

మంత్రులు, అధికారులు మారుతున్నా.. పనులు మాత్రం జరగడం లేదన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ కార్యాలయానికి వెళ్తే కనీసం మర్యాద కూడా ఇవ్వలేదని చెప్పారు. ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోతే.. ప్రజలకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారు.

రాష్ట్రంలోని దాదాపు అందరి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఉన్న‌డబ్బు.. అప్పులు చేసిన డబ్బు కూడా నేరుగా ప్రజల ఖాతాలోకి జగన్ బట్వాడా చేసేస్తుండడంతో అభివృద్ధి పనులు ఎక్కడా జరగడం లేదు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది.. పోనీ ఏదైనా రోడ్డుకు ప్రపోజల్స్ పెడితే ఆర్థిక శాఖలో కొర్రీలు పెట్టి ఆపేస్తున్నారు.